కామన్వెల్త్ క్రీడల్లో ఆదివారం జరిగిన మహిళల క్రికెట్ మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా తొమ్మిది పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. రెండో స్థానంలో నిలిచిన భారత్ రజతం తో సరిపెట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో బెత్ మూనీ 41 బంతుల్లో 61 పరుగులు చేయగా.. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది.
ఛేజింగ్‌లో భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 43 బంతుల్లో 65 పరుగులు చేసింది, మిగతా బ్యాట్స్ ఉమెన్లలో ఎవరూ రాణించకపోవడంతో టీమిండియా 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ చివరి ఐదు వికెట్లను 13 పరుగులకే చేజార్చుకుంది. స్పిన్నర్ ఆష్లీ గార్డనర్ 16 పరుగులకు 3 వికెట్లతో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచింది.
ఆస్ట్రేలియా; 161/8 (బెత్ మూనీ 61, రేణుకా సింగ్ 2/25, స్నేహ రాణా 2/38)
భారత్: 19.3 ఓవర్లలో 152 (హర్మన్‌ప్రీత్ కౌర్ 65, ఆష్లీ గార్డనర్ 3/16)