ఐదు టెస్టు బోర్డర్ - గావస్కర్ ట్రోఫిలో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సిండ్ డే టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు 184 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. రెండో ఇన్సింగ్సులో ఓపెనర్ జైస్వాల్ (84), పంత్ మినహా మిగతా ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో 3, లయన్ 2, స్టార్క్, హెడ్ చెరో వికెట్ తీశారు. 340 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 155 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులు చేయగా.. భారత్ 369 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్సింగ్స్‌లో ఆసీస్ 234 పరుగులకు ఆలౌటైంది. కాగా ఈ విజయంతో ఆస్ట్రేలియా 2 - 1తో లీడ్‌లోకి దూసుకెళ్లింది. దీంతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. డబ్ల్యూటీసీ టేబుల్‌లో 52.78 శాతంతో టీమిండియా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఫైనల్ చేరే అవకాశాలు రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకే ఎక్కువగా ఉన్నాయి.