సిడ్ని వేదికగా టీమ్ఇండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ౩౩౮ పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్‌స్మిత్ సెంచరీతో కదం తొక్కగా.. లబుషేన్(91) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా 4, సైనీ, బుమ్రా చెరో రెండు వికెట్లు, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకముందు ఓవర్‌నైట్ స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులతో రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్ మరో 172 పరుగులు చేసి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది.
రెండో రోజు ఉదయం లబుషేన్, స్మిత్ భారత బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆల్‌రౌండర్ జడేజా.. లబుషేన్ ఔట్ చేయడంతో.. ఆసీస్ వికెట్ల పతనం మొదలైంది. వచ్చిన బ్యాట్స్‌మెన్లు వచ్చినట్లు పెవిలియన్ చేరుతన్నా.. స్మిత్ ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీ తరువాత ధాటిగా ఆడిన స్మిత్.. జట్టు స్కోర్‌ను 300 పరుగులు దాటించాడు. చివర్లో మిచెల్ స్టార్క్(24) వేగంగా ఆడడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌట్ అయింది.