పుట్టిన‌రోజు నాడు ఆ ఫోటోతో రాహుల్‌కు విషెష్ చెప్పిన న‌టి

Athiya Shetty shows love for boyfriend KL Rahul in birthday post. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నేడు 30వ ఏట అడుగుపెట్టాడు

By Medi Samrat
Published on : 18 April 2022 7:26 PM IST

పుట్టిన‌రోజు నాడు ఆ ఫోటోతో రాహుల్‌కు విషెష్ చెప్పిన న‌టి

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నేడు 30వ ఏట అడుగుపెట్టాడు. దీంతో రాహుల్ స్నేహితురాలు అతియా శెట్టి ఇరువురు క‌లిసున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. నలుపు-తెలుపు రంగుల‌లో వారు కౌగిలించుకున్న ఫోటోలను చూడవచ్చు. "ఎనీవేర్ విత్ యూ, హ్యాపీ బర్త్ డే" అని అథియా తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. అతియా శెట్టి, కెఎల్ రాహుల్ కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

మార్చి 15న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరూ కలిసి కనిపించారు. కెఎల్ రాహుల్ ఐపీఎల్‌కి ముందు ముంబైలో ఉన్నాడు. బాలీవుడ్, క్రికెట్ అభిమానులు అతియా శెట్టి, కెఎల్ రాహుల్ ను కలిసి చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు. ఓ అభిమాని వీరివురిని పెళ్లి చేసుకోవాలని కూడా కోరాడు. గత సంవత్సరం అహాన్ శెట్టి తొలి చిత్రం తడప్ ప్రీమియర్ సందర్భంగా అతియా శెట్టి, రాహుల్ కలిసి మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు. అథియా తరచుగా రాహుల్‌తో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించ‌డం కోసం వెళ్తుంది.

ఇదిలావుంటే.. రాహుల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు వెలువెత్తాయి. టీమిండియా స‌హ‌చ‌రుల‌తో పాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ‌, క్రీడా రంగ‌ ప్ర‌ముఖులు రాహుల్‌కు విషెస్ తెలిపారు.














Next Story