అద్దె ఇంట్లో హీరోయిన్ తో రాహుల్..1
Athiya Shetty And KL Rahul To Rent An Apartment In Mumbai. క్రికెటర్ కెఎల్ రాహుల్ బాలీవుడ్ నటి అతియా శెట్టితో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 22 April 2022 9:30 PM ISTక్రికెటర్ కెఎల్ రాహుల్ బాలీవుడ్ నటి అతియా శెట్టితో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే..! 3 సంవత్సరాలుగా డేటింగ్ చేస్తూ వచ్చిన అతియా శెట్టి, క్రికెటర్ KL రాహుల్ ముంబైలో ఒక అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకున్నారు. త్వరలో కలిసి ఒకే ఇంటికి మారనున్నట్లు Pinkvilla నివేదించింది. ముంబైలో సముద్రానికి ఎదురుగా ఉన్న 4BHK అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారని నివేదించబడింది.
పింక్‌విల్లా నివేదికలో "అతియా శెట్టి, క్రికెటర్ KL రాహుల్ బాంద్రాలోని కార్టర్ రోడ్ అపార్ట్‌మెంట్‌లో సముద్రానికి ఎదురుగా ఉన్న 4BHK అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. అపార్ట్మెంట్ అద్దె నెలకు ₹ 10 లక్షలు అవుతుంది." అని ఉంది.
అతియా శెట్టి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అనే సంగతి తెలిసిందే..! అతియా-రాహుల్ లవ్ ను సునీల్ శెట్టి ఎప్పుడో యాక్సెప్ట్ చేశారు. అంతకుముందు, ఈటైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అతియా తండ్రి, నటుడు సునీల్ శెట్టి మాట్లాడుతూ, "నాకు అహాన్ స్నేహితురాలు అన్నా ఇష్టమే.. అతియా చూస్తున్న వ్యక్తి అయినా ఇష్టమే. దానితో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, తన భార్యకి సమస్య లేదు. వారి నిర్ణయాలతో సంతోషంగా ఉన్నాం." అని సునీల్ శెట్టి వెల్లడించాడు. సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియా శెట్టి, 2015లో సూరజ్ పంచోలితో కలిసి నటించిన 'హీరో' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది, ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆమె హాస్య చిత్రం 'ముబారకాన్'లో కూడా నటించింది. చివరిగా నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి మోతీచూర్ చక్నాచూర్ చిత్రంలో కనిపించింది. ఆమె ప్రాజెక్ట్‌లను ఇప్పటి వరకు ప్రకటించలేదు.