టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా కప్ తర్వాత భారత పురుషుల జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనాల్సి ఉంది.

By Medi Samrat  Published on  27 Aug 2023 8:15 PM IST
టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా కప్ తర్వాత భారత పురుషుల జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనాల్సి ఉంది. చైనాలోని హాంగ్‌జౌలో జరిగే ఆసియాడ్‌కు భారత ప్రధాన క్రికెట్ జట్టు వెళ్లదు. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో యంగ్‌ టీమిండియా చైనాలో పర్యటించనుంది. ఆ సమయంలో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతోంది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, అతని సహాయక సభ్యులకు సమయం తక్కువగా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) చీఫ్ VVS లక్ష్మణ్.. ఆసియా క్రీడల‌కు రుతురాజ్ జట్టుతో ప్రధాన కోచ్‌గా వెళ్లనున్నాడు.

ఆసియా క్రీడల చరిత్రలో క్రికెట్ మూడోసారి ఈ ఈవెంట్‌లో భాగం కానుంది. భారత్ తొలిసారిగా పురుషుల జట్టును పంపుతోంది. ఈసారి ఆసియా క్రీడల్లో సెప్టెంబర్ 19 నుంచి మ‌హిళ‌ల‌ క్రికెట్ ప్రారంభం కానుంది. ఫార్మాట్‌లో ఐసీసీ ర్యాంకింగ్స్‌ ఆధారంగా భారత్‌ 26న క్వార్టర్‌ ఫైనల్‌ దశలోకి ప్రవేశించనుంది. పురుషుల ఈవెంట్ సెప్టెంబర్ 28న ప్రారంభమవుతుంది, ఫైనల్ అక్టోబర్ 7న జరుగుతుంది. పురుషుల విభాగంలో 15 జట్లు, మహిళల విభాగంలో తొమ్మిది జట్లు ఆసియా క్రీడల్లో పాల్గొంటాయి. జూన్ 1, 2023 నాటికి అన్ని జట్లూ వారి ICC ర్యాంకింగ్‌ల ఆధారంగా సీడ్ చేయబడతాయి.

మరోవైపు అక్టోబర్ 5న ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. మీడియా నివేదికల ప్రకారం.. లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులో ఎన్సీఏ శిబిరాన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఆసియా క్రీడల కోసం లక్ష్మణ్ సహాయక సిబ్బందిలో భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే బౌలింగ్ కోచ్‌గా, మునీష్ బాలి ఫీల్డింగ్ కోచ్‌గా ఉంటారు.

మహిళల జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆల్‌రౌండర్ హృషికేశ్ కనిట్కర్ బాధ్యతలు చేపట్టనున్నారు. అతని సహాయక సిబ్బందిలో రాజీబ్ దత్తా (బౌలింగ్ కోచ్), శుభదీప్ ఘోష్ (ఫీల్డింగ్ కోచ్) ఉన్నారు.

ఆసియా క్రీడలకు పురుషుల జట్టు

రుతురాజ్ గైక్వాడ్ (c), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (wk), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివం మావి, శివమ్ దూబే, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).

స్టాండ్‌బై ఆటగాళ్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.

ఆసియా క్రీడలకు మహిళల జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, దేవిక వైద్య, అంజలి సర్వాణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, కనికా ఎ మిన్ను మణి, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), అనూషా బారెడీ.

స్టాండ్‌బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కశ్వీ గౌతమ్, స్నేహ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్.

Next Story