ఆసియా కప్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా..?
Asia Cup will be postponed to 2023. భారత క్రికెట్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) కు కేవలం ఒక్క అడుగు
By Medi Samrat
భారత క్రికెట్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) కు కేవలం ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇంగ్లాండ్ తో జరిగే ఆఖరి టెస్ట్ మ్యాచ్ ను అటు డ్రాగా ముగించినా.. లేక విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా భారత్ సగర్వంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు వెళ్తుంది. అయితే భారతజట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరితే మాత్రం ఆసియా కప్ వాయిదా పడే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరితే ఆసియాకప్‌ను వాయిదా వేయక తప్పదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ ఎహ్‌సాన్ మణి అన్నారు. కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన ఆసియాకప్ వాయిదా పడింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్‌లో ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. అయితే అదే సమయంలో డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా జరగాల్సి ఉంది. 'ఆసియాకప్ గతేడాది జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలు కనిపించడం లేదు. జూన్‌లో టోర్నీ నిర్వహిస్తామని శ్రీలంక ముందుకు వచ్చింది. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఆ సమయంలోనే ఉండటంతో మరోసారి ఈ టోర్నీని వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది' అని అన్నాడు ఎహ్‌సాన్ మణి.
ఇంగ్లండ్‌తో మార్చి 4 నుంచి అహ్మదాబాద్ వేదికగా జరగనున్న చివరి టెస్ట్‌ను కనీసం డ్రా చేసుకున్నా భారతజట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్తుంది. అలా కాకుండా ఓడితే మాత్రం ఆసీస్ ఫైనల్ కు చేరుకుంటుంది.