ఆసియా కప్‌ ప్రారంభ తేదీని ప్రకటించిన ఏసీసీ

ఆసియా కప్‌ సంబరాలు మొదలుకానున్నాయి. ఎట్టకేలకు ఆసియాకప్‌ 2023 ప్రారంభ తేదీని

By Srikanth Gundamalla  Published on  15 Jun 2023 6:15 PM IST
Asia Cup-2023, ACC, India, Pakistan, Cricket

ఆసియా కప్‌ ప్రారంభ తేదీని ప్రకటించిన ఏసీసీ

ఆసియా కప్‌ సంబరాలు మొదలుకానున్నాయి. ఎట్టకేలకు ఆసియాకప్‌ 2023 ప్రారంభ తేదీని ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. రెండు దేశాల్లోని వేదికల్లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 17వ తేదీ వరకు జరగనున్నట్లు ఏసీసీ తెలిపింది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘానిస్తాన్, నేపాల్‌తో కూడిన టోర్నీ 18 రోజుల పాటు జరగనున్నట్లు వివరించింది. వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ ఆసియా కప్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు ఉంటాయి.

కాగా.. ఈ టోర్నమెంట్ హైబ్రీడ్ మోడల్‌లో జరగనుంది. పాకిస్తాన్‌లో నాలుగు మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇక మిగిలిన 9 మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా నిర్వహించనున్నట్లు ఏసీసీ ప్రతినిధులు ప్రకటించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌ టోర్నీకి పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇస్తోంది. ఆసియాకప్‌-2023 ద్వారా భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ వీక్షించే అవకాశం క్రికెట్‌ అభిమానులకు మరోసారి రానుంది. అయితే.. పాకిస్తాన్‌తో జరిగే టీమిండియా మ్యాచ్‌ శ్రీలంలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. బీసీసీ, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మధ్య మాటల యుద్ధం సాగడంతో ఆసియాకప్‌ నిర్వహణపై మొదట సిందిగ్ధం ఉండేది. తటస్థ వేదికల్లో కొన్ని మ్యాచ్‌లు నిర్వహించేలా హైబ్రిడ్‌ మోడల్‌ను పాకిస్తాన్‌ ప్రతిపాదించింది. కొన్ని చర్చల తర్వాత దాయాదుల పోరు లేకుండా ప్రపంచ కప్ జరిగితే ఇంట్రెస్ట్‌, ఆదరణ తగ్గుతుందని ఐసీసీ భావించింది. దీంతో రంగంలోకి దిగి ఎలాంటి షరతులు లేకుండా పాక్‌ను ఒప్పించింది. అంతేకాక పాక్‌ ప్రతిపాదించిన హైబ్రిడ్‌ మోడల్‌ను కూడా ఏసీసీ అంగీకరించింది. దీంతో.. ఈ టోర్నీ నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.ఇప్పటి వరకు తేదీలను మాత్రమే ప్రకటించారు. ఆసియా కప్‌ మ్యాచ్‌లకు ఇంకా వేదికలను ఖరారు చేయాల్సి ఉంది. 2023 ఎడిషన్‌లో రెండు గ్రూపులుగా జట్లు తలబడతాయి. ఒక్కో గ్రూపు నుంచి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ 4 నుంచి రెండు జట్లు ఫైనల్స్‌కు చేరుకుంటాయి.

Next Story