ఆసియా కప్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. జాక్‌పాట్ కొట్టేసిన‌ తిల‌క్ వ‌ర్మ

ఆసియా కప్‌కు భారత జట్టును ప్రకటించారు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మళ్లీ జట్టులోకి వచ్చారు.

By Medi Samrat  Published on  21 Aug 2023 8:29 AM GMT
ఆసియా కప్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. జాక్‌పాట్ కొట్టేసిన‌ తిల‌క్ వ‌ర్మ

ఆసియా కప్‌కు భారత జట్టును ప్రకటించారు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మళ్లీ జట్టులోకి వచ్చారు. చాలా కాలంగా గాయం కారణంగా ఇద్దరూ జ‌ట్టుకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరూ తిరిగి జ‌ట్టులోకి వచ్చారు. జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ కూడా వ‌న్డే జట్టులో పునరాగమనం చేయ‌నున్నారు. టీమ్‌లో కొత్త ముఖంగా తిలక్ వర్మ కనిపించనున్నాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తిలక్‌ని ఎంపిక చేసి ఆశ్చర్యపరిచింది. తిలక్ వర్మ ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో టీ20 అరంగేట్రం చేశాడు.

ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 17 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్ర‌క‌టించ‌గా.. సంజు శాంసన్ బ్యాకప్ వికెట్ కీపర్ (18వ)గా ఉంటాడు.

ప్రపంచ కప్ మాదిరిగా కాకుండా.. ఆసియా కప్ రూల్స్‌ 17 మందితో కూడిన జట్టును అనుమతిస్తాయి. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశాయి. ఈ ఏడాది ఆసియా కప్‌ను పాకిస్థాన్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. తొలి మ్యాచ్ ఆగస్టు 30న ముల్తాన్‌లో పాకిస్థాన్, నేపాల్ మధ్య జరగనుంది.

ఆసియా కప్ కు టీమ్ ఇండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ షమీ , మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్‌ కృష్ణ.

Next Story