రిజల్ట్ చూసే వాళ్లలో నేను లేను.. గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్ గిల్‌పై కోచ్ నెహ్రా కామెంట్స్..!
హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చిన తర్వాత గుజరాత్ టైటాన్స్ తదుపరి కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు.
By Medi Samrat Published on 20 Dec 2023 9:08 AM GMTహార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చిన తర్వాత గుజరాత్ టైటాన్స్ తదుపరి కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. GTకి ముందు గిల్ నాలుగు సంవత్సరాలు KKR జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2022 సంవత్సరంలో గిల్ గుజరాత్ జట్టులో చేరాడు. అప్పటి నుంచి అతడు మరింత దూకుడుగా మారాడు. పాండ్యా నాయకత్వంలో.. గుజరాత్ టైటాన్స్ 2022 కప్ కొట్టగా అందులో గిల్ కీలక పాత్ర పోషించాడు. 2023లో ఫైనల్‌కు చేరుకున్న GT జట్టులో కూడా గిల్ ముఖ్యమైన సభ్యుడు.
శుభ్‌మన్ గిల్ గిల్ గత సీజన్‌లో GT తరుపున మొత్తం 17 మ్యాచ్‌ల్లో కనిపించాడు. 59.33 సగటుతో 157.80 స్ట్రైక్ రేట్‌తో 890 పరుగులు చేశాడు. ఇందులొ మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. గిల్ బ్యాటింగ్ గురించి అందరికీ తెలుసు. అయితే అతడు పాండ్యా బాధ్యతను చక్కగా నిర్వర్తించగలడా అనేది ప్రశ్న. గత రెండు సీజన్‌లలో GT జట్టు వరుసగా ఫైనల్స్‌కు చేరుకుంది. ఈసారి గిల్ తన కెప్టెన్సీతో జట్టును ఫైనల్‌కు చేర్చగలడా అనేది పెద్ద ప్రశ్న.
ఈ ఊహాగానాలపై గుజరాత్ ప్రస్తుత ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా స్పందించారు ప్రతి క్షణం గిల్ నిర్ణయానికి జట్టు మద్దతు ఇస్తుందని చెప్పాడు. యువకుడైన గిల్ జట్టు కెప్టెన్సీకి ఉత్తమ వ్యక్తి అని కూడా పేర్కొన్నాడు. ఐపీఎల్ వేగవంతమైన గేమ్.. ప్రతి ఒక్కరికీ సవాళ్లను ఇస్తుంది. గత మూడు, నాలుగేళ్లలో గిల్ ఆటతీరు ఎలా ఉందో చూస్తున్నాం. ప్రస్తుతం అతని వయస్సు 24-25 సంవత్సరాలు.. కానీ అతనికి మంచి అనుభవం ఉందన్నారు. అతనికి మద్దతు ఇవ్వడానికి మేం ఉంటాం. జట్టుకు అతడిపై నమ్మకం ఉంది. అందుకే కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఎప్పుడూ రిజల్ట్ చూసే వాళ్లలో నేను లేను. మ్యాచ్ సమయంలో ప్రతి ఒక్కరూ ఫలితాల కోసం ప్రయత్నిస్తారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అందరూ ఫలితం వైపు చూస్తారు. కెప్టెన్సీ విషయానికి వస్తే.. మీరు ప్రతి అంశాన్ని పరిశీలించాలి. అతను జట్టు కెప్టెన్సీకి సరైన వ్యక్తి అని మాకు నమ్మకం ఉందన్నారు.