అమ్మాయిగా మారిన టీమిండియా క్రికెటర్ కుమారుడు

సంజయ్ బంగర్.. భారత క్రికెట్ అభిమానులకు చిరపరిచితుడు. భారత క్రికెట్ జట్టుకు సేవలు అందించిన సంజయ్ బంగర్ కుమారుడు అమ్మాయిగా మారినట్లు ప్రకటించాడు

By Medi Samrat  Published on  11 Nov 2024 2:52 PM IST
అమ్మాయిగా మారిన టీమిండియా క్రికెటర్ కుమారుడు

సంజయ్ బంగర్.. భారత క్రికెట్ అభిమానులకు చిరపరిచితుడు. భారత క్రికెట్ జట్టుకు సేవలు అందించిన సంజయ్ బంగర్ కుమారుడు అమ్మాయిగా మారినట్లు ప్రకటించాడు. భారత మాజీ ఆల్‌రౌండర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ ఇటీవల సోషల్ మీడియాలో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి వివరించాడు. ఆర్యన్ ఇప్పుడు అనయ గా మారిపోయాడు.

హార్మోన్లలో వచ్చిన మార్పుల కారణంగా తాను అమ్మాయిగా మారాల్సి వచ్చిందంటూ తన ప్రయాణాన్ని పంచుకున్నాడు. అనయ 2023లో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT)ని ప్రారంభించింది. లింగమార్పిడి ద్వారా మహిళగా మారింది. ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లో క్రికెట్ ఆడుతున్న అనయ తన భావోద్వేగ ప్రయాణాన్ని తెలిపే వీడియోను పోస్ట్ చేసింది. నా శరీరం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నాలో అసంతృప్తి క్రమక్రమంగా తగ్గుతోంది. నేను చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇప్పుడు నేను వేసే ప్రతీ అడుగు నాకు బాగా నచ్చుతోందని తెలిపింది.

సంజయ్‌ బంగర్‌కు ఇద్దరు కుమారులు కాగా ఆర్యన్ పెద్ద వాడు. సంజయ్ బంగర్ భారత్ తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. కోచ్ గా సంజయ్ బంగర్ మంచి పేరు తెచ్చుకున్నాడు.

Next Story