పరిస్థితి మారుతోంది.. ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్‌పై బిగ్ అప్‌డేట్‌..!

ఐపీఎల్-2025 కొనసాగింపుకు సంబంధించి భారత ప్రభుత్వ ఆదేశాల కోసం బీసీసీఐ వేచిచూస్తోందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ గురువారం తెలిపారు.

By Medi Samrat
Published on : 9 May 2025 7:46 AM IST

పరిస్థితి మారుతోంది.. ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్‌పై బిగ్ అప్‌డేట్‌..!

ఐపీఎల్-2025 కొనసాగింపుకు సంబంధించి భారత ప్రభుత్వ ఆదేశాల కోసం బీసీసీఐ వేచిచూస్తోందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ గురువారం తెలిపారు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌పై ఇంకా ఎలాంటి సంక్షోభం లేదని ధుమాల్ చెప్పాడు.

గురువారం భారత్‌పై పాకిస్థాన్‌ దాడి చేయడంతో పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆ తర్వాత ఆటగాళ్లను సురక్షితంగా స్టేడియం నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సమావేశం ఏర్పాటు చేసింది.

ధుమాల్ వార్తా సంస్థ పిటిఐతో మాట్లాడుతూ.. "మేము ప్రస్తుత పరిస్థితిని చూస్తున్నాము. పరిస్థితి మారుతుంది.. మాకు ఇంకా ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు.. సహజంగానే అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోబడుతుంది.. శుక్రవారం లక్నోలో జరగనున్న మ్యాచ్ గురించి తనను అడిగినప్పుడు.. "ప్రస్తుతానికి ఈ మ్యాచ్ జ‌రుగుతుంది.. కానీ పరిస్థితి మారుతోంది.. ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతికే ప్రియాంష్ ఆర్య రూపంలో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. దీని తర్వాత స్టేడియంలోని ఫ్లడ్ లైట్లలో ఒకటి ఆరిపోయింది, ఆపై మరికొన్ని.. ఆ తర్వాత మ్యాచ్‌ను రద్దు చేశామని, భద్రతే కారణమంటూ నిర్ణయం వెలువడింది. పాక్ దాడి తర్వాత చాలా నగరాల్లో చీకటి వాతావరణం నెలకొంది. అటువంటి పరిస్థితిలో, ధర్మశాలలోని స్టేడియంను సైన్యం స్వాధీనం చేసుకుంది.. ఆటగాళ్లను సురక్షితంగా హోటల్‌కు తీసుకెళ్లింది.

అదేవిధంగా అభిమానులను కూడా సులువుగా బయటకు తీసుకొచ్చి స్టేడియం మొత్తాన్ని ఖాళీ చేయించారు. ధర్మశాల విమానాశ్రయం ఇప్పటికే మూసివేయబడినందున ఇప్పుడు రెండు జట్లను ప్రత్యేక వందే భారత్ రైలులో ఢిల్లీకి తీసుకువస్తారు. అందువల్ల పంజాబ్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ ధర్మశాలకు బదులుగా అహ్మదాబాద్‌కు మార్చబడింది.

Next Story