విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్

ArrestKohli trends on Twitter after his fan murders Rohit Sharma’s fan. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లు. వీరిద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు

By Medi Samrat  Published on  15 Oct 2022 4:35 PM IST
విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లు. వీరిద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఇద్దరు అభిమానులు చేసిన పనులు మొత్తం క్రీడా ప్రపంచానికే షాకింగ్ గా నిలిచింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ‌ అభిమానులు గొడవపడటంతో ఏకంగా ఒక ప్రాణమే పోయింది. నిందితుడైన విరాట్ కోహ్లీ అభిమాని మద్యం మత్తులో స్నేహితుడిని కత్తితో పొడిచి చంపాడు. తమిళనాడు అరియలూరు జిల్లా పొయ్యూరు అనే గ్రామంలో పి.విఘ్నేష్ (24), చనిపోయాడు.

మంగళవారం రాత్రి మల్లూరు సమీపంలోని సిడ్కో ఇండస్ట్రియల్ ఇస్టేట్ ప్రాంతంలో విఘ్నేష్, ధర్మరాజ్ మద్యం తాగుతూ క్రికెట్ గురించి చర్చ ప్రారంభించారు. ఇంతలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంను విరాట్ కోహ్లీని హేళన చేస్తూ విఘ్నేష్ మాట్లాడాడు. దీంతో మందు బాటిల్‭తో విఘ్నేష్ తల పగలకొట్టాడు ధర్మరాజ్. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బుధవారం ఉదయం విఘ్నేష్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్‌లో శనివారం ఉదయం '#ArrestKohli' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ధర్మరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.

"It's not Virat Kohli's fault," అంటూ కోహ్లీ ఫాలోవర్లు పోస్టులు పెడుతున్నారు.

"Dear Virat Kohli, I request you to take care of your safety as the next target of your fans may be none other than you," అని మరో యూజర్ కూడా చెప్పుకొచ్చాడు.


Next Story