5 వికెట్లతో అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్

పోర్వోరిమ్‌లోని గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్‌లో బుధవారం ప్లేట్ డివిజన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన 17వ ఫస్ట్‌క్లాస్ గేమ్‌లో గోవా పేసర్ అర్జున్ టెండూల్కర్ తన తొలి ఐదు వికెట్లు తీశాడు

By Medi Samrat  Published on  13 Nov 2024 9:45 PM IST
5 వికెట్లతో అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్

పోర్వోరిమ్‌లోని గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్‌లో బుధవారం ప్లేట్ డివిజన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన 17వ ఫస్ట్‌క్లాస్ గేమ్‌లో గోవా పేసర్ అర్జున్ టెండూల్కర్ తన తొలి ఐదు వికెట్లు తీశాడు. అరుణాచల్ ప్రదేశ్‌ను 84 పరుగులకు ఆలౌట్ చేయడంలో టెండూల్కర్ అద్భుతమైన బౌలింగ్ ముఖ్య కారణం. కేవలం తొమ్మిది ఓవర్లలో 5/25తో అర్జున్ టెండూల్కర్ తన బౌలింగ్ ను ముగించాడు. నీలం ఓబీ, నబమ్ హచాంగ్, చిన్మయ్ పాటిల్, జే భావ్‌సర్, మోజీ ఈటే అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఈ స్పెల్‌కు ముందు, అర్జున్ 14 గేమ్‌లలో 37.75 సగటుతో 32 వికెట్లు తీశాడు.

అరుణాచల్‌ను తక్కువ స్కోర్ కు కట్టడి చేసిన తర్వాత గోవా బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కేవలం 54 ఓవర్లలో 414/2 స్కోరు చేసింది గోవా.

Next Story