భారత్‌కు మరో పతకం

Archer Harvinder Singh stages comeback to enter quarter-finals. పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల ఆర్చరీ వ్యక్తిగత

By Medi Samrat  Published on  3 Sep 2021 1:54 PM GMT
భారత్‌కు మరో పతకం

టోక్యో : పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్‌ పోటీల్లో హర్విందర్‌ సింగ్‌ కాంస్య పతకం సాధించాడు. పారాలింపిక్స్‌ ఆర్చరీ విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. ఇది వరకు 2018 ఆసియా పారా క్రీడల్లో తొలిసారి స్వర్ణం సాధించిన హర్విందర్‌ ఇప్పుడు విశ్వ క్రీడల్లోనూ సత్తా చాటాడు. కొరియన్‌ అథ్లెట్‌ కిమ్‌తో కాంస్య పోరులో పోటీపడిన హర్విందర్‌ 6-5 (26-24, 27-29, 28-25, 25-25, 26-27) (10-8) తేడాతో గెలుపొందాడు.

అంతకుముందు సెమీఫైనల్స్‌లో అమెరికా అథ్లెట్‌ కెవిన్‌ మాదర్‌ చేతిలో 6-4 (25-28, 24-24, 25-25, 25-24, 24-26) తేడాతో ఓటమిపాలయ్యాడు. మరోవైపు ఈ ఉదయం ప్రవీణ్‌ కుమార్‌ హైజంప్‌లో రజతం సాధించగా.. అవనీ లేఖరా 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఎస్‌హెచ్‌ 1 పోటీల్లో కాంస్య పతకం సాధించింది. దీంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య 13కు చేరడం గమనార్హం. కాంస్య ప‌త‌కం సాధించిన హర్విందర్‌ సింగ్ ను ప్ర‌ధాని మోదీ అభినందించారు. ఈ మేర‌కు మోదీ ట్వీట్ చేశారు.



Next Story