పాక్ టీమ్‌కు కొత్త కోచ్..!
పాక్ జట్టులో వరుస మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఐసీసీ ప్రపంచ కప్ 2023 నుంచి నిష్క్రమించినప్పటి నుండి పాకిస్తాన్ జట్టులో
By Medi Samrat Published on 25 Dec 2023 10:11 AM GMTపాక్ జట్టులో వరుస మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఐసీసీ ప్రపంచ కప్ 2023 నుంచి నిష్క్రమించినప్పటి నుండి పాకిస్తాన్ జట్టులో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్‌ను మార్చారు. ఆ తర్వాత పాకిస్థాన్ ఫీల్డింగ్ కోచ్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్, స్పిన్ బౌలింగ్ కోచ్, కెప్టెన్ అందరి మార్పు జిగింది. ఒత్తిడి నేపథ్యంలో బాబర్ ఆజం స్వయంగా కెప్టెన్సీని వదులుకున్నాడు. దీంతో వైట్ బాల్ క్రికెట్, రెడ్ బాల్ క్రికెట్ రెండింటి కెప్టెన్లను మార్చారు. తాజాగా పాకిస్థాన్ కోచ్ కూడా మారాడు.
న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. దీంతో సిరీస్ కు ముందు పాకిస్థాన్ కోచ్‌ని మార్చారు. కోచ్‌గా పాకిస్థాన్ మాజీ వెటరన్ ఆటగాడు యాసిర్ అరాఫత్‌కు బాధ్యతలు అప్పగించారు. సైమన్ హెల్మట్ స్థానంలో ఆయనకు ఈ పదవిని అప్పగించారు. ఇప్పటి వరకు సైమన్ హెల్మోట్ హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించేవాడు. ఆస్ట్రేలియాతో ఆడే సిరీస్‌లో హెల్మోట్‌ను కోచ్‌గా చేర్చారు.. అయితే న్యూజిలాండ్ సిరీస్‌కు ఆ బాధ్యత యాసిర్ అరాఫత్‌కు అప్పగించారు.
యాసిర్ అరాఫత్ న్యూజిలాండ్ టూర్‌కు మాత్రమే కోచ్‌గా ఉంటాడని.. ఈ సిరీస్ తర్వాత ఆ బాధ్యతను మరొకరికి అప్పగిస్తారని కూడా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో టాప్ కోచ్ బాధ్యతలను ఎవరు చేపడతారనేది ఇంకా నిర్ణయించలేదు. ఆస్ట్రేలియా పర్యటన కోసం మాజీ స్పిన్ బౌలర్ సయీద్ అజ్మల్‌కు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా, మాజీ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్‌కు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా, ఆడమ్ హోల్యోక్‌కు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించారు. అంతే కాకుండా హై పెర్ఫార్మెన్స్ కోచ్ బాధ్యతలను సైమన్ హెల్మోట్‌కు అప్పగించారు. అయితే ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు హెల్మోట్‌ను కూడా తొలగించి.. ఈ బాధ్యతను యాసిర్ అరాఫత్‌కు అప్పగించారు.