భారత జట్టుకు కొత్త స్పాన్సర్..!

భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌ను ప్రకటించారు. 2027 వరకు ఈ హక్కులను దక్కించుకుంది

By -  Medi Samrat
Published on : 16 Sept 2025 6:39 PM IST

భారత జట్టుకు కొత్త స్పాన్సర్..!

భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌ను ప్రకటించారు. 2027 వరకు ఈ హక్కులను దక్కించుకుంది అపోలో టైర్స్ సంస్థ. బెట్టింగ్ సంబంధిత అప్లికేషన్స్ పై నిషేధం విధించిన తర్వాత, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) డ్రీమ్11తో తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

అపోలో టైర్స్ BCCIకి మ్యాచ్‌కు రూ.4.5 కోట్లు చెల్లించనుంది. గతంలో డ్రీమ్11 రూ.4 కోట్ల రూపాయలు ఇచ్చేది. భారతదేశానికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ భారీ డీల్ కోసం అపోలో టైర్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఇటీవలి సంవత్సరాలలో భారత క్రికెట్‌లో అత్యంత లాభదాయకమైన స్పాన్సర్‌షిప్ ఒప్పందాలలో ఒకటిగా కూడా గుర్తించబడింది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో భారత పురుషుల జట్టుకు స్పాన్సర్ లేరు, ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మహిళల జట్టుకు కూడా స్పాన్సర్షిప్ లేదు. సెప్టెంబర్ 30 నుండి భారతదేశం- శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న మహిళల ప్రపంచ కప్ కోసం మహిళల జట్టు జెర్సీలపై కొత్త స్పాన్సర్‌ను ప్రదర్శిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.

Next Story