కుమార్తె ముఖం కనిపించడంపై విరాట్ కోహ్లీ, అనుష్కల స్పందన ఇదే..!

Anushka Sharma and Virat Kohli's daughter Vamika's face revealed. విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌ కూతురు వామికా ఫోటోలు మూడో వన్డే సమయంలో

By Medi Samrat  Published on  24 Jan 2022 8:18 AM GMT
కుమార్తె ముఖం కనిపించడంపై విరాట్ కోహ్లీ, అనుష్కల స్పందన ఇదే..!

విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌ కూతురు వామికా ఫోటోలు మూడో వన్డే సమయంలో తొలిసారి బ‌య‌ట‌కు వ‌చ్చాయి. విరాట్ హాఫ్ సెంచ‌రీ కొట్టిన త‌ర్వాత .. స్టాండ్స్‌లో ఉన్న అనుష్కా, వామికా వైపు చూస్తూ కోహ్లీ సంకేతాలు చేశాడు. బ్యాట్‌తో ఊయ‌ల ఊపుతున్న స‌మ‌యంలో టీవీ బ్రాడ్‌క్యాస్ట‌ర్ అనుకోకుండా అనుష్క, వామికాలను చూపించారు. కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత స్టాండ్స్‌లో ఉన్న భార్య అనుష్క శర్మ, బిడ్డ వామిక వైపు చూస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు. బ్యాట్‌ను చంకలో పెట్టుకొని జోలపాడుతున్నట్లు సైగ చేశాడు విరాట్. స్టాండ్స్‌లో ఉన్నోళ్లంతా చప్పట్లు కొట్టడం చూసిన కోహ్లీ కూతురు వామిక కూడా వారిని అనుకరిస్తూ చప్పట్లు కొట్టింది.

మిత్రులారా, మా కూతురి ఫోటోల‌ను నిన్న స్టేడియంలో క్యాప్చ‌ర్ చేశార‌ని, వాటిని సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా షేర్ చేస్తున్నార‌ని తెలిసిన‌ట్లు కోహ్లీ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. అయితే త‌మ‌కు తెలియ‌కుండానే ఆ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని, కెమెరా త‌మ వైపు ఫోక‌స్ చేసిన‌ట్లు త‌మ‌కు తెలియ‌ద‌ని కోహ్లీ అన్నాడు. ముందుగా చెప్పిన కార‌ణాల ప్ర‌కారం, త‌మ కూతురి ఫోటోను ఎవ‌రూ తీయ‌వ‌ద్దు అని, షేర్ చేయ‌వ‌ద్దు అని కోహ్లీ త‌న అభిమానుల్ని కోరాడు. సోష‌ల్ మీడియాకు త‌న కూతుర్ని ఇప్పుడే ప‌రిచ‌యం చేయ‌డం స‌రికాదు అని, ఎందుకంటే ఆమెకు సోష‌ల్ మీడియా అంటే ఏమిటో ఇప్పుడే అర్ధంకాద‌న్న విష‌యాన్ని కోహ్లీ మ‌రోసారి గుర్తు చేశాడు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు ఇదే స్టేటస్ ను తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. కాబట్టి కుమార్తె ఫోటోల విషయంలో తమ వైఖరి మారలేదని మరోసారి తెలియజేసింది ఈ జంట.


Next Story