టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఒక రోజు తర్వాత, క్రికెటర్ విరాట్ కోహ్లీ, తన భార్య అనుష్క శర్మతో కలిసి ఓ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించారు. సోమవారం టెస్ట్ క్రికెట్‌కు తన రిటైర్‌మెంట్ ప్రకటించాడు. దీంతో 14 సంవత్సరాల టెస్ట్ కెరీర్‌కు అతడు ముగింపు పలికినట్లైంది. భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచాక విరాట్ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కోహ్లీ ఇప్పుడిక కేవలం వన్డే క్రికెట్‌లోనే కొనసాగుతున్నాడు.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, తన భార్య అనుష్కశర్మతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ధామ్‌కు వెళ్లిన ఈ జంట ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. వీరు గతంలోనూ చాలాసార్లు ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ తర్వాత కోహ్లీ పాల్గొన్న మొదటి వ్యక్తిగత కార్యక్రమం ఇది. ఈ జంట ఆధ్యాత్మిక నాయకుడిని సందర్శించడం ఇదే మొదటిసారి కాదు. వారు ఆయన సత్సంగాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు మరియు వారి పిల్లలు వామిక మరియు అకాయ్‌తో కలిసి తరచుగా అక్కడ కనిపించారు.