మళ్లీ వార్తల్లో నిలిచిన కావ్య మారన్.. కారణం క్రికెట్ కాదు..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఐపీఎల్ సీజన్ సమయాల్లో వార్తల్లో నిలుస్తుంటుంది.
By Medi Samrat
సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఐపీఎల్ సీజన్ సమయాల్లో వార్తల్లో నిలుస్తుంటుంది. కానీ ప్రస్తుతం మరో కారణంతో ఆమె వార్తల్లో నిలిచింది. 33 ఏళ్ల కావ్య పెళ్లి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ వ్యక్తి భారత్‌లో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం.
ఈ సంగీత దర్శకుడు మరెవరో కాదు.. అనేక సూపర్‌హిట్ చిత్రాలకు హిట్ ట్రాక్‌లను కంపోజ్ చేసిన అనిరుధ్ రవిచందర్. తాజా పుకార్ల ప్రకారం.. కావ్య, అనిరుధ్ త్వరలో ఒకరినొకరు పెళ్లి చేసుకోబోతున్నారు. సంగీత పరిశ్రమలో అనిరుధ్ రవిచందర్‌కు మంచి పేరుంది. తన హిట్ ట్రాక్‌లతో ఎప్పుడూ వార్తల్లో ఉండే అతడు.. ఈసారి కావ్యతో తన ఎఫైర్ కారణంగా వెలుగులోకి వచ్చాడు. రజనీకాంత్‌కు దగ్గరి బంధువైన అనిరుధ్ కావ్యతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇటీవల ఒక రెడ్డిట్ వినియోగదారు ఒక పోస్ట్‌లో.. "సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ టీవీ కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL జట్టు యజమాని కావ్య మారన్ మధ్య సంబంధం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యక్తిగతంగా కళానిధి మారన్‌తో వారి సంబంధం గురించి మాట్లాడినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోవచ్చని పేర్కొన్నాడు.
ఈ పోస్ట్‌లో కావ్య, అనిరుధ్‌లను లాస్ వెగాస్‌లో చూశానని ఒక వినియోగదారు పేర్కొన్నారు. "నేను ఒక సంవత్సరం క్రితం లాస్ వెగాస్‌లో వారిని చూశాను, వారు వేగాస్ ట్రిప్‌లో షికారు చేస్తూ ఆనందకరమైన సమయం గడుపుతున్నారు" అని వినియోగదారు వ్యాఖ్యానించారు.
మరో వినియోగదారు.. నేను అనిరుధ్ పాత ఇంటర్వ్యూని చూస్తున్నాను.. అందులో అతని ప్రేమ జీవితం గురించి అంచనా వేశాడు. అతడు బాగా చదువుకున్న, టెలికాం ప్రసార పరిశ్రమలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంటాడని చెప్పాడు. ఇది నిజమైతే.. ఇది నిజంగా క్రేజీ అని రాసుకొచ్చాడు. ఇప్పటి వరకూ ఈ పుకార్లకు సంబంధించి కావ్య లేదా అనిరుధ్ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో ఈ రూమర్స్‌కు ఇప్పట్లో చెక్ పడేలా లేదు.