Video : విరాట్ కోహ్లీని, ఇతర భారత ఆటగాళ్లను కౌగిలించుకోవద్దు

ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే వారం పాకిస్థాన్, న్యూజిలాండ్ జ‌ట్ల‌ మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది.

By Medi Samrat  Published on  16 Feb 2025 3:37 PM IST
Video : విరాట్ కోహ్లీని, ఇతర భారత ఆటగాళ్లను కౌగిలించుకోవద్దు

ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే వారం పాకిస్థాన్, న్యూజిలాండ్ జ‌ట్ల‌ మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్‌లో అగ్రశ్రేణి ఎనిమిది ODI జట్లు పోటీ పడుతుండగా, ఉపఖండంలోని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కీలక మ్యాచ్ మాత్రం ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్. ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరగనున్న ఈ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థులు పోటీ పడనున్నాయి. అందుకే ఈసారి మ్యాచ్‌కు అదనపు ప్రాముఖ్యత ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వాస్తవానికి పూర్తిగా పాకిస్తాన్‌లో జరగాల్సి ఉంది. అయితే భారత క్రికెట్ జట్టును ఆ దేశానికి పంపడం లేదని BCCI తెలిపింది. టోర్నమెంట్‌ను హైబ్రిడ్ ఫార్మాట్‌లో ఆడాలని నిర్ణయించబడింది, భారత్‌ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది.

తమ దేశంలోనే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌ జరగాలని ఆశించిన పాకిస్థాన్ అభిమానులను ఈ నిర్ణయం నిరాశపరిచింది. పాక్ క్రికెట్ అభిమానులు భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పాక్ జర్నలిస్ట్ ఫరీద్ ఖాన్ తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ వరకు భారత క్రికెటర్లతో స్నేహాన్ని పక్కన పెట్టాలని మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టును పాక్ క్రికెట్ అభిమాని కోరుతున్న వీడియోను అతను పోస్ట్ చేశాడు. విరాట్ కోహ్లీని, ఇతర భారత ఆటగాళ్లను కౌగిలించుకోవద్దని పాక్ ఆటగాళ్లకు చెప్పారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్థాన్.. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్‌ను ఓడించింది. గ్రూప్ దశలో పాకిస్థాన్‌ను ఓడించిన భారత్.. టైటిల్‌ను ఎగరేసుకుపోతుందని భావించారు. కానీ పాకిస్థాన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ మ్యాచ్ కు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది.

Next Story