Video : పాకిస్థాన్‌ను చిత్తు చేసిన తర్వాత కుల్దీప్‌పై విరుచుకుపడ్డ హార్దిక్..!
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో ఓడించి సూపర్ 8కి చేరుకుంది.
By - Medi Samrat |
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో ఓడించి సూపర్ 8కి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి నిజమైన హీరో ఇషాన్ కిషన్. అతడు బ్యాట్‌తో 77 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టు 175 పరుగులు చేయడంలో సహాయపడ్డాడు. దీనికి సమాధానంగా పాకిస్తాన్ జట్టు 114 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. మ్యాచ్ తర్వాత అందరూ సంబరాలు చేసుకుంటుండగా.. భారత ఆటగాళ్లు మైదానం మధ్యలో గొడవ పడ్డారు, దీనికి సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది.
వీడియోలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ ఒకరితో ఒకరు వాదించుకుంటూ కనిపించగా.. రింకు-సూర్య జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. మ్యాచ్ సమయంలో కుల్దీప్ యాదవ్ షహీన్ అఫ్రిది ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద వదిలాడు. 18వ ఓవర్‌లో హార్దిక్ వేసిన రెండో బంతిని షహీన్ స్లాగ్ చేయడానికి ప్రయత్నించాడు.. బంతి ఎత్తుకు వెళ్లింది. కుల్దీప్ బంతిని బాగానే అందుకునే ప్రయత్నం చేశాడు.. కానీ చివరి క్షణంలో ఏకాగ్రత లేకపోవడం వల్ల.. బంతి అతని చేతుల నుండి జారి నేరుగా బౌండరీ దాటింది. దీంతో బ్యాట్స్‌మన్ 6 పరుగులు పొందాడు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అంతకుముందే క్యాచ్ మిస్ చేశాడు. బౌలర్ హార్దిక్ పాండ్యా వరుసగా రెండు అవకాశాలను కోల్పోయిన తర్వాత నిరాశకు లోనయ్యాడు.
మ్యాచ్ తర్వాత ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తుండగా.. హార్దిక్ కుల్దీప్‌తో వాదించుకుంటూ కనిపించాడు. కెప్టెన్ సూర్య కూడా కుల్దీప్‌పై కోపంగా ఉన్నట్లు కనిపించాడు. ఆ సమయంలో తిలక్ వర్మ ముఖంలో ఆందోళన కనిపించింది. రింకు సింగ్ పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు.
ఆ వీడియో ఆధారంగా హార్దిక్ చాలా కోపంగా ఉన్నాడని తెలుస్తుంది. కుల్దీప్ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ వెంటనే ముగిసి ఉండేది. బదులుగా.. బ్యాట్స్‌మెన్ ఆరు పరుగులు పొందగా.. హార్దిక్ అదనపు బంతులు వేయాల్సి వచ్చింది. 18వ ఓవర్ చివరి బంతికి ఉస్మాన్ తారిక్‌ను అవుట్ చేయడం ద్వారా హార్దిక్ భారత విజయాన్ని నిర్ధారించాడు.
HARDIK WAS ANGRY 🤣🤣🤣#INDvsPAK #India #win #hardik #virat pic.twitter.com/RTTd14REEq
— LUCKY RAJ (@luckyhuckere) February 15, 2026