టెస్టుల్లో అరంగేట్రం.. అమ్మ‌ను హత్తుకొని భావోద్వేగానికి గురైన తెలుగు క్రికెట‌ర్‌

Andhra's KS Bharat hugging mother before test debut melts hearts.టెస్టుల్లో తెలుగు కుర్రాడు కోన శ్రీకర్ భరత్ అరంగ్రేటం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2023 2:09 PM IST
టెస్టుల్లో అరంగేట్రం.. అమ్మ‌ను హత్తుకొని భావోద్వేగానికి గురైన తెలుగు క్రికెట‌ర్‌

టెస్టుల్లో తెలుగు కుర్రాడు కోన శ్రీకర్ భరత్ అరంగ్రేటం చేశాడు. నాగ‌పూర్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో శ్రీక‌ర్‌తో పాటు సూర్య‌కుమార్ యాద‌వ్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో టీమ్ఇండియా త‌రుపున తొలిసారి బ‌రిలోకి దిగారు. భ‌ర‌త్‌కు టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు, న‌యా వాల్ ఛ‌తేశ్వ‌ర్ పుజారా టీమ్ఇండియా క్యాప్‌ను అంద‌జేశాడు.


అంతకుముందు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఓ వీడియోను విడుద‌ల చేసింది. అందులో అరంగ్రేటం సంద్భంగా భ‌ర‌త్ త‌న మ‌న‌సులోని మాట‌ను భ‌య‌ట‌పెట్టాడు. ఎట్ట‌కేల‌కు ఫ‌లితం ద‌క్కింది. టీమ్ఇండియా త‌రుపున ఆడ‌టం చాలా సంతోషంగా ఉంది. ఇది కేవ‌లం నా క‌ల మాత్ర‌మే కాదు. నాకు మ‌ద్ద‌తుగా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రు కోరుకున్నారు. నా కుటుంబ స‌భ్యులు, భార్య‌, స్నేహితులు, కోచ్‌లు అండ‌గా నిలిచారు. వీరి మ‌ద్ద‌తు లేక‌పోతే ఇంత వ‌ర‌కు వ‌చ్చే వాడిని కాదు. అంటూ బావోద్వేగానికి లోనైయ్యాడు.

అంత‌క‌ముందు తాను టెస్టుల్లో అరంగ్రేటం చేయ‌నున్నట్లు తెలుసుకున్న భ‌ర‌త్ త‌న త‌ల్లిని కౌగిలించుకున్న ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక భ‌ర‌త్‌ను అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

విశాఖ‌ప‌ట్నానికి చెందిన భ‌ర‌త్ 1993లో జ‌న్మించాడు. 2012లో ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2015లో గోవాతో జ‌రిగిన రంజీ మ్యాచ్‌లో 308 ప‌రుగులు చేసి రంజీల్లో ట్రిపుల్ సెంచ‌రీ చేసిన తొలి వికెట్‌గా కీప‌ర్‌గా నిలిచాడు. భార‌త్‌-ఎ జ‌ట్టులో రెగ్యుల‌ర్ స‌భ్యుడిగా ఉంటున్నాడు. 79 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచుల్లో 9 శ‌త‌కాలు, 23 అర్థ‌శ‌త‌కాల సాయంతో 4,289 ప‌రుగులు చేశాడు.

Next Story