గుజరాత్ టైటాన్స్‌కు అమూల్ స్పెషల్ విషెస్
Amul Wishes Gujarat Titans. ఐపీఎల్-2022 ఆదివారం ముగిసింది. గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌లో విజయం సాధించి
By Medi Samrat Published on 31 May 2022 1:30 PM ISTఐపీఎల్-2022 ఆదివారం ముగిసింది. గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలిసారిగా హార్దిక్ పాండ్యా సారథ్యంలో మైదానంలోకి దిగిన గుజరాత్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి కప్ గెలుచుకుంది. గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించిన తర్వాత.. అదే రాష్ట్రానికి చెందిన అగ్రగామి పాల ఉత్పత్తిదారు అయిన అమూల్.. ప్రత్యేకమైన కార్టూన్‌తో ఆ బృందాన్ని అభినందించింది.
కు యాప్ ద్వారా అమూల్.. గుజరాత్ టైటాన్స్ సాధించిన అద్భుతమైన విజయాన్ని గుర్తు చేసింది. అమూల్ గర్ల్ కార్టూన్‌తో పాటు దాని పోస్ట్‌లో.. "తొలి సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది" అని రాసింది.
అమూల్ యొక్క సిగ్నేచర్ స్టైల్ కార్టూన్ లో.. "టైటాన్స్ యాద్ హై! అమూల్ హృదయపూర్వక స్వాగతం." హార్దిక్ పాండ్యా చేతిలో ఐపీఎల్ ట్రోఫీని పట్టుకుని ఉండగా.. అమూల్ అమ్మాయి చేతిలో మెరుస్తున్న అమూల్ బట్టర్‌ను పట్టుకుని ఉంది. హార్దిక్ పాండ్యా, అమూల్ గర్ల్ ఈ కార్టూన్ లో ఉన్నారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
చివరి మ్యాచ్‌లో గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన బలమైన బౌలింగ్‌తో రాజస్థాన్‌ను 130 పరుగులకే పరిమితం చేశాడు. హార్దిక్ తన బ్యాట్‌తో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు, అయితే సంజు శాంసన్, హెట్మెయర్, బట్లర్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్‌ల వికెట్లను తీశాడు. గుజరాత్ టైటాన్స్‌ను గత ఏడాది సివిసి క్యాపిటల్ కొనుగోలు చేసింది. తర్వాత జట్టు వేలంలో చాలా మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది, కానీ జట్టు తొలిసారే ఛాంపియన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.