ఇదే చివరి ఐపీఎల్ : అంబటి రాయుడు
Ambati Rayudu to retire from IPL after ongoing season.ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022
By తోట వంశీ కుమార్ Published on 14 May 2022 8:20 AM GMTప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్ నే తనకు ఆఖరి సీజన్ అని తెలుగు తేజం అంబటి రాయుడు ప్రకటించాడు. వచ్చే ఏడాది నుంచి తాను ఐపీఎల్‌కు అందుబాటులో ఉండనని చెప్పేశాడు. ప్రస్తుతం ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పాటు గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ముంబై ఇండియన్స్ జట్టుకు ధన్యవాదాలు తెలియజేశాడు.
'ఇది నా చివరి ఐపిఎల్ అని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. నేను 13 సంవత్సరాలుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. రెండు గొప్ప జట్ల(చెన్నై, ముంబై)లో భాగమైనందుకు గర్వంగా ఉంది. నా ప్రయాణంలో అండగా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా' అని రాయుడు సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. 2010లో ముంబై ఇండియన్స్ తరపున రాయుడు అరంగేట్రం చేశాడు. 2018లో చెన్నై జట్టు రాయుడిని కొనుగోలు చేసింది.
కాగా.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 187 మ్యాచులు ఆడినరాయుడు 29.3 సగటుతో 4,187 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ తో పాటు రెండు అర్థశతకాలు ఉన్నాయి. ఇక ఈ సీజన్‌లో చెన్నై ప్లే ఆప్స్ చేరే అవకాశం కూడా లేదు. మరో రెండు మ్యాచులు మాత్రమే చెన్నై ఆడనుంది. మే 15న గుజరాత్ తో, మే 20 రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. తనకు అచ్చొచ్చిన ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో రాయుడు తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌ను ఆడనున్నాడు.