కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడ‌నున్న అంబటి రాయుడు..!

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జ‌ట్టుకు ఆడేందుకు

By Medi Samrat  Published on  11 Aug 2023 7:00 PM IST
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడ‌నున్న అంబటి రాయుడు..!

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జ‌ట్టుకు ఆడేందుకు భారత మాజీ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు సంతకం చేశాడు. దీంతో కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న రెండో భారత ఆటగాడిగా అంబటి రాయుడు నిలిచాడు. సీపీఎల్‌ 2023 ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 25 వరకు జరుగుతుంది. అయితే రాయుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే విష‌యం బీసీసీఐ వద్ద పెండింగ్‌లో ఉంది.

రిటైర్డ్ ఆటగాళ్లకు విదేశీ లీగ్‌లలో పాల్గొనే అవకాశం కల్పించే ముందు వారికి ఒక సంవత్సరం కూలింగ్ పీరియడ్ ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఐపీఎల్ 2023 తర్వాత రాయుడు.. అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

యుఎస్‌లో జరిగే మేజర్ లీగ్ క్రికెట్‌లో అంబటి రాయుడు టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాల‌ని అనుకున్నాడు. కానీ బీసీసీఐ ప్లాన్ కారణంగా రాయుడు ఉపసంహరించుకున్నాడు. BCCI కూలింగ్ ఆఫ్ పీరియడ్ కారణంగా రాయుడు సీపీఎల్‌-2023లో పాల్గొనగలడా అనేది ఆసక్తికరంగా మారింది.

సీపీఎల్‌లో ఆడే అవకాశం వస్తుందని రాయుడు ఆశాభావం వ్యక్తం చేశాడు. రాయుడు మాట్లాడుతూ.. “సెయింట్ కిట్స్, నెవిస్ పేట్రియాట్స్‌లో చేరడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. రాబోయే సీపీఎల్ 2023లో జట్టుకు సానుకూల సహకారం అందించడంపై నేను దృష్టి సారిస్తానన్నాడు.

పేట్రియాట్స్ యజమాని మహేష్ రమణి ఒక ప్రకటనలో.. “అంబటి రాయుడు అనుభవం మాకు ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. రాయుడు తన అద్భుతమైన కెరీర్‌లో వివిధ జట్లతో టైటిళ్లను గెలుచుకున్నాడు. రెండవ సీపీఎల్‌ టైటిల్‌ను గెలుస్తానని మేము ఆశిస్తున్నామన్నారు.

అంబటి రాయుడు IPL-2023లో మోస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. IPL 2023లో 12 ఇన్నింగ్స్‌లలో 139.82 స్ట్రైక్ రేట్‌తో 158 పరుగులు చేశాడు. సెయింట్ కిట్స్, నెవిస్ పేట్రియాట్స్ తమ CPL-2023 ప్రారంభ మ్యాచ్‌ను ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌తో ఆగస్టు 19న ఆడ‌నుంది.

Next Story