నేటి నుంచి వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌.. గ‌త ఏడాది ఫైన‌ల్ ఆడిన రెండు జ‌ట్ల మ‌ధ్యే తొలి మ్యాచ్‌..!

ఈరోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌ తొలి మ్యాచ్ జరగనుంది.

By Medi Samrat  Published on  23 Feb 2024 12:30 PM IST
నేటి నుంచి వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌.. గ‌త ఏడాది ఫైన‌ల్ ఆడిన రెండు జ‌ట్ల మ‌ధ్యే తొలి మ్యాచ్‌..!

ఈరోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌ తొలి మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్‌లో మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి రెండవ సీజన్ ను ఘ‌నంగా ప్రారంభించాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి. తొలి సీజన్ టైటిల్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ సార‌ధ్యంలోని ముంబయి ఇండియన్స్ గెలుచుకుంది. ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.

ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌కి టాస్‌ వేయనున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఫిబ్రవరి 23న కలర్ ఫుల్ గా ప్రారంభం కానుంది. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు మహిళల ప్రీమియర్ లీగ్‌లో ప్రారంబోత్స‌వ వేడుక‌లో ప్రదర్శన ఇవ్వబోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది.

మహిళల ప్రీమియర్ లీగ్‌ ఇప్పటి వరకు ఒక సీజన్ మాత్రమే జ‌రిగింది. తొలి సీజన్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 3 మ్యాచ్‌లు జరిగాయి. అందులో ముంబై ఇండియన్స్ 2, ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి గెలిచాయి. ఇందులో ఒక విజయాన్ని ముంబై ఇండియన్స్ ఫైనల్ మ్యాచ్‌లో సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ పై గెలిచి ఫైన‌ల్లో ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని భావిస్తుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు

మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సీ, లారా హారిస్, అన్నాబెల్ సదర్లాండ్, స్నేహ దీప్తి, జెస్ జోనాసెన్, అశ్వనీ కుమారి, తానియా భాటియా, అరుంధతి రెడ్డి, టిటాస్ సాధు, పూనమ్ యాదవ్.

ముంబై ఇండియన్స్ జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), హేలీ మాథ్యూస్, హుమైరా కాజీ, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, క్లో ట్రయాన్, అమేలియా కెర్, ఇస్సీ వాంగ్, జింటిమణి కలితా, అమన్‌దీప్ కౌర్, కీర్తన్ బాలకృష్ణన్, సజీవన్ సంజన, యాస్తికా భాటియా, సైకా ఇస్మాయిల్, షబ్యాంకా ఇస్మాయిల్, ఫాతిమా జాఫర్.

Next Story