రాజభవనం లాంటి ఇల్లు, కోట్లలో జీతం.. అజిత్ అగార్కర్‌కు ఎంత ఆస్తి ఉందో తెలుసా.?
టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈరోజు 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
By - Medi Samrat |
టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈరోజు 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 1977లో అజిత్ అగార్కర్ ముంబైలో జన్మించాడు, అతడు భారత క్రికెట్ గొప్ప బౌలర్లలో ఒకడిగా పేరు గడించాడు. అజిత్ అగార్కర్ తన క్రికెట్ కెరీర్‌ను బ్యాట్స్‌మెన్‌గా ప్రారంభించినప్పటికీ.. బౌలర్‌గా మారి భారత్ తరఫున ఆడి ఎన్నో రికార్డులు సృష్టించాడు. అతడు 1 ఏప్రిల్ 1998న ఆస్ట్రేలియాపై తన ODI అరంగేట్రం చేసాడు. అతడు కేవలం 23 మ్యాచ్‌లలోనే 50 వికెట్లు తీసి వెటరన్ బౌలర్ డెన్నిస్ లిల్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
191 వన్డేల్లో ఆడి మొత్తం 288 వికెట్లు తీశాడు. ఇది మాత్రమే కాదు.. క్రికెట్ మక్కాగా పిలువబడే లార్డ్స్ మైదానంలో 8వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తూ అజిత్ అగార్కర్ సెంచరీ చేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 133 వన్డే మ్యాచ్‌లలో 200 వికెట్లు తీసి, 1,000 పరుగులు చేసిన ప్రత్యేకమైన రికార్డు కూడా అతని పేరిట ఉంది. అయితే అజిత్ అగార్కర్ టెస్ట్ రికార్డు అంత గొప్పగా లేదు. 26 టెస్టుల్లో 58 వికెట్లు తీశాడు. అజిత్ అగార్కర్ ప్రస్తుతం టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్‌గా ఉండగా.. ఆయన నికర విలువ ఎంతో తెలుసుకుందాం..
అజిత్ అగార్కర్ నికర ఆస్తుల విలువ 5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.40 కోట్లు. చీఫ్ సెలెక్టర్ ఉద్యోగం ద్వారా అతడు దాదాపు రూ. 3 కోట్ల జీతం పొందుతాడు. ఇది కాకుండా.. అతడు తన కెరీర్‌లో IPL జట్టు KKR, ఢిల్లీ జట్టుకు కూడా ఆడాడు. వ్యాఖ్యాతగా అజిత్‌కు ఒక మ్యాచ్‌కు రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల జీతం లభించింది.
అజిత్ అగార్కర్ తన ముస్లిం స్నేహితుని సోదరి ఫాతిమా ఘడియాలీని 2002లో వివాహం చేసుకున్నాడు. అజిత్, ఫాతిమాకు ఒక కుమారుడు ఉన్నాడు. అజిత్ విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నాడు. జిమ్ నుండి గార్డెనింగ్ వరకు, అతడి ఇల్లు చాలా స్మార్ట్, మాడ్యులర్‌గా ఉంటుంది. అజిత్ అగార్కర్‌కు వాహనాలంటే చాలా ఇష్టం. అతడి వద్ద BMW సహా పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆయన వద్ద యమహా, BMW కంపెనీల బైక్‌లు కూడా ఉన్నాయి.