బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్.. జీతం ఎంతో తెలుసా?

Ajit Agarkar named India men's chairman of selectors. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా భారత మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు.

By Medi Samrat  Published on  5 July 2023 7:00 PM IST
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్.. జీతం ఎంతో తెలుసా?

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా భారత మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. అయితే అగార్కర్ విషయంలో భారీగా జీతం పెంచారు. ఇంతకు ముందు చీఫ్ సెలక్టర్‌కు ఏడాదికి కోటి రూపాయలు వేతనంగా ఇస్తుండగా, ఇప్పుడు దానిని రూ.3 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది. కామెంటరీ విధులు, పలు జట్లకు సంబంధించి కీలక బాధ్యతల్లో ఉన్న అగార్కర్.. చీఫ్ సెలెక్టర్ అయితే వాటన్నిటినీ వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో కోటి రూపాయలు తక్కువ మొత్తమని అగార్కర్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బీసీసీఐ వేతనాన్ని భారీగా పెంచినట్లు క్రిక్‌బజ్ తెలిపింది. చీఫ్ సెలక్టర్ వార్షిక జీతాన్ని మూడు కోట్లకు పెంచిన బీసీసీఐ.. ఇతర సెలక్టర్ల వేతనాన్ని 90 లక్షలు పెంచింది.

టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముగ్గురు సభ్యుల సలహా సంఘం ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో మెరుగైన ప్రజంటేషన్ ఇచ్చిన అజిత్ అగార్కర్ ను చీఫ్ సెలెక్టర్ గా ఎంపిక చేశారు. జాతీయ సెలెక్షన్ కమిటీలో సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్, శివసుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ సభ్యులుగా ఉంటారు. వీరు జోన్ల వారీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 45 ఏళ్ల అగార్కర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో 26 టెస్టులాడాడు. ఆల్ రౌండర్ గా 58 వికెట్లు తీశాడు. టెస్టుల్లో అగార్కర్ కు ఒక సెంచరీ కూడా ఉంది. వన్డేల్లో 191 మ్యాచ్ లాడి 288 వికెట్లు పడగొట్టాడు. అగార్కర్ 42 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు.


Next Story