మ్యాచ్ ముగిసిన వెంటనే కోహ్లీకి క్షమాపణలు చెప్పాను
Ajinkya Rahane reveals dressing room talks after Adelaide run out. టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి మరో స్టార్ బ్యాట్స్‌మన్
By Medi Samrat Published on 25 Dec 2020 4:50 PM IST
టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి మరో స్టార్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానే క్షమాపణలు చెప్పాడు. అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సెంచరీకి చేరువవున్న క్రమంలో 74 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. సమన్వయ లోపం కారణంగా ఈ రనౌట్ జరిగింది.
పుజారా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే నిలదొక్కుకోవడంతో కెప్టెన్ కోహ్లి, రహానే మధ్య 88 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన కోహ్లి సెంచరీ దిశగా దూసుకెళుతున్న వేళ.. అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తొలుత పరుగుకు పిలిచిన రహానే ఆ తర్వాత మనసు మార్చుకుని కోహ్లీని వెనక్కి వెళ్లమన్నాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
లయన్ బౌలింగ్‌లో రహానే బంతిని ఫ్లిక్ చేయగా మిడాఫ్‌లో ఉన్న హాజల్‌వుడ్ బంతిని అందుకుని లయన్‌కు అందించాడు. ఈ క్రమంలో రహానే కాల్‌తో అప్పటికే కోహ్లి.. సగం పిచ్ దాటేయగా లయన్ బంతిని నేరుగా వికెట్లను గిరాటేయడంతో అతడు రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఫలితం మారిపోయింది. రహానేపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
ఈ విషయంపై తాజాగా స్పందించిన తాత్కాలిక కెప్టెన్ రహానే.. మ్యాచ్ ముగిసిన తర్వాత తాను కోహ్లీని కలిసి క్షమాపణలు చెప్పినట్టు తెలిపాడు. మరేం పర్లేదు అన్నాడని.. ఆ సమయంలో జట్టు మంచి స్థితిలో ఉందని, మంచి భాగస్వామ్యం నెలకొల్పామని చెప్పాడు.. అయితే, క్రికెట్‌లో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని.. ఆ రనౌట్ ఆస్ట్రేలియా విజయం సాధించడానికి పరోక్షంగా కారణమైందని రహానే పేర్కొన్నాడు.