యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఓ అనామక బ్యాట్స్‌మెన్ భీక‌ర‌మైన ఇన్నింగ్సు ఆడాడు. కేవ‌లం 28 బంతుల్లోనే సెంచరీ బాది చ‌రిత్ర సృష్టించాడు. అత‌డి ఇన్నింగ్సులో 13 సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉండ‌టం విశేషం. వివ‌రాళ్లోకెళితే.. యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన 32 ఏళ్ల అహ్మద్ ముస్సాదిక్.. టిహెచ్‌సిసి హాంబర్గ్‌ జట్టుపై వీరవిహారం చేశాడు. కేవ‌లం 33 బంతుల్లో 115 పరుగులు సాధించాడు.

ముస్సాదిక్ విజృంభ‌ణ‌తో కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ జట్టు కేవ‌లం 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ముస్సాదిక్ 13 బంతుల్లో అర్ధ శతకం పూర్తిచేసి.. త‌ర్వాతి 15 బంతుల్లో సెంచ‌రీ మార్కు చేరుకుని.. కేవ‌లం 28 బంతుల్లో శ‌త‌క‌బాది ఇన్నింగ్స్ చివ‌రి బంతికి పెవిలియ‌న్ చేరాడు. అనంత‌రం 199 పరుగలు లక్ష్య‌చేధ‌న‌తో బ‌రిలోకి దిగిన టిహెచ్‌సిసి హాంబర్గ్ జ‌ట్టు 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 53 పరుగులు మాత్రమే చేసి.. ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది.

సామ్రాట్

Next Story