Video : ఆసియా కప్‌కు ముందు 'రింకూ సింగ్' విధ్వంసం..!
యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.
By Medi Samrat
యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. భారత జట్టు ఫినిషర్‌గా పేరున్న రింకూ లక్నో ఫాల్కన్స్‌పై కేవలం 27 బంతుల్లో 57 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రింకూ ఇన్నింగ్సులో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. రింకూ ఇన్నింగ్స్ కారణంగా మీరట్ మావెరిక్స్ 93 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలిచింది.
Another day, another top knock from Rinku Singh 👏👏👏pic.twitter.com/jvcmQQge9r
— KolkataKnightRiders (@KKRiders) August 27, 2025
మీరట్ మావెరిక్స్ జట్టు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ స్వస్తిక్ చికర్ శుభారంభం చేసి 55 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అక్షయ్ దూబే కేవలం 2 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో జట్టు ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను రితురాజ్ తీసుకున్నాడు. అయితే.. జట్టు 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో రింకూ ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అలాంటి సమయంలో రితురాజ్ శర్మతో కలిసి 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. 211.11 స్ట్రైక్ రేట్ తో 57 పరుగులు చేసిన రింకు.. టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను కూడా వదిలిపెట్టలేదు. భువీ వేసిన ఓ ఓవర్‌లో 3 ఫోర్లు బాది మొత్తం 15 పరుగులు పిండుకున్నాడు. అయితే రింకూ 18వ ఓవర్లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మీరట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 233/4 భారీ స్కోరు చేసింది. రితురాజ్ శర్మ 37 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి అద్భుత ప్రదర్శన చేశాడు. 234 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో ఫాల్కన్స్ జట్టు 18.2 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది.