వీధుల్లో క్రికెట్ ఆడిన రషీద్ ఖాన్

Afghanistan Cricketer Rashid Khan Plays Gully Cricket With Indian Fans. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కు క్రికెట్ ప్రపంచంలో మంచి పేరు ఉంది.

By Medi Samrat  Published on  5 May 2023 6:00 PM IST
వీధుల్లో క్రికెట్ ఆడిన రషీద్ ఖాన్

Afghanistan Cricketer Rashid Khan Plays Gully Cricket With Indian Fans


ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కు క్రికెట్ ప్రపంచంలో మంచి పేరు ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. అతను ఆఫ్ఘనిస్తాన్ కు అనేక విజయాలను అందించాడు. ఇక పలు లీగ్ లలో కూడా రషీద్ ఖాన్ సత్తా చాటాడు. ప్రస్తుతం అతను IPL 2023లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. లెగ్ స్పిన్‌తో 24 ఏళ్ల బౌలింగ్ ఆల్‌రౌండర్ ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ ఉన్నాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించడంలో అతడి భాగస్వామ్యం కూడా ఉంది. ప్రస్తుతం అతను ఐపిఎల్‌లో భాగంగా భారతదేశంలో ఉన్నాడు. ఒక వీధిలో క్రికెట్ ఆడుతూ కనిపించాడు.

Mufaddal Vohra (@mufaddal_vohra) అనే ట్విట్టర్ అకౌంట్ లో రషీద్ ఖాన్ వీధుల్లో క్రికెట్ ఆడిన వీడియోను అప్లోడ్ చేశారు. "Rashid Khan is playing street cricket with the Indian fans. One of the most humble characters in the game!" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్.. వేలల్లో లైక్స్ వచ్చాయి.


Next Story