టీ20 ప్రపంచ కప్ లో సంచలనం.. న్యూజిలాండ్ అవుట్

T20 ప్రపంచ కప్ 2024 టైటిల్ ఫేవరెట్స్ లో ఒక టీమ్ అయిన న్యూజిలాండ్ జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది.

By అంజి  Published on  14 Jun 2024 4:07 AM GMT
Afghanistan, T20 World Cup, new zealand, Papua New Guinea

టీ20 ప్రపంచ కప్ లో సంచలనం.. న్యూజిలాండ్ అవుట్ 

T20 ప్రపంచ కప్ 2024 టైటిల్ ఫేవరెట్స్ లో ఒక టీమ్ అయిన న్యూజిలాండ్ జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ (AFG) ఏడు వికెట్ల తేడాతో పపువా న్యూ గినియా (PNG) జట్టుపై విజయం సాధించడంతో న్యూజిలాండ్ (NZ)ని టోర్నీ నుండి నిష్క్రమించింది. మొదట బౌలింగ్ ఎంచుకున్న తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ 19.5 ఓవర్లలో కేవలం 95 పరుగులకే PNG ని కట్టడి చేసింది. అనంతరం ఆఫ్ఘనిస్థాన్ జట్టు 15.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

ఫలితంగా, టోర్నమెంట్‌లో న్యూజిలాండ్‌ కు ఇంకా రెండు మ్యాచ్ లు ఉన్నా కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు మ్యాచ్ లలో మూడూ గెలిచి సూపర్ 8 దశకు అర్హత సాధించింది. కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఓపెనింగ్ ఎన్‌కౌంటర్‌లో 84 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో ఈ టోర్నమెంట్ లో న్యూజిలాండ్ ముందుకు వెళ్లడం చాలా కష్టమైంది. గ్రూప్ సి నుండి ఆఫ్ఘనిస్థాన్, విండీస్ జట్లు సూపర్ 8 కు అర్హత సాధించగా.. కివీస్, ఉగాండా, పపువా న్యూ గినియా జట్లు క్వాలిఫై కూడా అవ్వకుండా ఇంటిబాట పట్టాయి.

Next Story