భారీ సిక్సర్‌తో స్పాన్సర్‌కు నష్టం మిగిల్చిన అభిషేక్ శర్మ.. ఏం జ‌రిగిందో వీడియోలో చూడు..!

శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నంత‌సేపు ఒక్కో షాట్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.

By Medi Samrat
Published on : 24 May 2025 10:29 AM IST

భారీ సిక్సర్‌తో స్పాన్సర్‌కు నష్టం మిగిల్చిన అభిషేక్ శర్మ.. ఏం జ‌రిగిందో వీడియోలో చూడు..!

శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ క్రీజులో ఉన్నంత‌సేపు ఒక్కో షాట్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అయితే అభిషేక్ శర్మ కొట్టిన షాట్ స్పాన్సర్‌కు భారీ నష్టాన్ని కలిగించింది. అభిషేక్ శర్మ ఒక సిక్స్ కొట్టాడు.. ఆ బంతి వెళ్లి నేరుగా స్పాన్సర్ కారు విండ్‌షీల్డ్ మీద ప‌డ‌టంతో గ్లాసు ప‌గిలింది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భువనేశ్వర్ కుమార్ ఓవర్ ఐదో బంతిని కొద్దిగా ఆఫ్ స్టంప్ వెలుపల వేశాడు. అభిషేక్ శర్మ వెంటనే దూరాన్ని పసిగట్టి డీప్ మిడ్ వికెట్ వైపు శక్తివంతమైన షాట్ కొట్టాడు. బంతి నేరుగా వెళ్లి కారు విండ్‌షీల్డ్‌కు తగలడంతో అది పగిలిపోవడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ M చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది.. అయితే కర్ణాటకలో నిరంతర వర్షం కారణంగా ఈ మ్యాచ్ లక్నోలోని ఏకనా స్టేడియంకు మార్చబడింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో RCB మ్యాచ్ వర్షం కారణంగా వాష్ అయినందున ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఐపీఎల్ 2025 65వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో RCB 42 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. లక్నోలో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ జట్టు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమితో లీగ్‌ దశను టాప్‌-2లో ముగించాలన్న ఆర్‌సీబీ ఆశలకు గట్టి దెబ్బ తగిలింది.

Next Story