ఐసీసీ ర్యాంకింగ్స్ లో అభిషేక్ సత్తా!!

ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు.

By -  Knakam Karthik
Published on : 11 Feb 2026 8:00 PM IST

Sports News, ICC rankings, Abhishek, Team India

ఐసీసీ ర్యాంకింగ్స్ లో అభిషేక్ సత్తా!!

ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, బౌలర్ల జాబితాలో వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటర్ల జాబితాలో అభిషేక్ శర్మ 909 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్, పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

బౌలర్ల విభాగంలో వరుణ్ చక్రవర్తికి, రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్‌కు మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో ర్యాంకుకు చేరాడు. సికందర్ రజా, పాకిస్థాన్ ఆటగాడు సైమ్ అయూబ్‌ను వెనక్కి నెట్టి ఆల్‌రౌండర్ల జాబితాలో తిరిగి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.

Next Story