ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ పక్కా..!
AB de Villiers Confirms His IPL Return In 2023 With Royal Challengers Bangalore. ఏబీ డివిలియర్స్ ఈ ఏడాదే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు.
By Medi Samrat Published on 25 May 2022 8:50 AM GMTఏబీ డివిలియర్స్ ఈ ఏడాదే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ లో పునరాగమనంపై ఏబీడీ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేయడంతో క్రికెట్ అభిమానులు తెగ ఆనంద పడుతున్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్ లో తాను రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని.. అయితే ఎలా వస్తాననేది మాత్రం ఇప్పుడే చెప్పలేనని వెల్లడించాడు. తన స్నేహితుడు విరాట్ ఈ విషయాన్ని ధ్రువీకరించడం సంతోషం కలిగించే విషయమన్నాడు. ''బెంగళూరులో వచ్చే ఏడాది మ్యాచ్ లుంటాయని తెలిసింది. నా రెండో హోం టౌన్ కు తిరిగొచ్చేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. చిన్నస్వామి స్టేడియం పూర్తిగా నిండి పూర్తిస్థాయి ప్రేక్షక సామర్థ్యం మధ్య జరిగే మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా. పునరాగమనం కోసం ఆసక్తిగా ఉన్నా'' అని వెల్లడించాడు.
డివిలియర్స్ పునరాగమనంపై అంతకుముందు విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. వచ్చే ఏడాది డివిలియర్స్ రీ ఎంట్రీ ఇస్తాడని అన్నాడు. తాను అతడితో నిత్యం మాట్లాడుతున్నానని, టచ్ లోనే ఉన్నానని చెప్పాడు. తనకు అతడు ఎప్పుడూ మెసేజ్ చేస్తుంటాడని చెప్పాడు.
AB డివిలియర్స్ క్రికెట్‌లో భారీ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న క్రికెటర్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడినప్పుడల్లా ఏబీడీ గుర్తుకు వస్తాడు. ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియానికి తిరిగి రావడానికి ఇష్టపడుతున్నానని వెల్లడించాడు. డివిలియర్స్ వచ్చే ఏడాది అతడు టోర్నమెంట్‌లో ఏ హోదాలో చేరతాడో ఖచ్చితంగా తెలియదని చెప్పాడు. RCB తరపున ఆడిన ఏబీడీ 39.71 సగటుతో 5,162 పరుగులు నమోదు చేశాడు. అతను ఆర్సీబీ తరపున మూడు సెంచరీలు కూడా నమోదు చేశాడు. ఇటీవలే క్రిస్ గేల్‌తో పాటు డివిలియర్స్ కూడా RCB హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరారు.