క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన డివిలియ‌ర్స్‌.. షాక్‌లో ఆర్‌సీబీ అభిమానులు

AB de Villiers announces retirement from all forms of cricket.రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అభిమానుల‌కు నిజంగా ఇది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Nov 2021 8:35 AM GMT
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన డివిలియ‌ర్స్‌.. షాక్‌లో ఆర్‌సీబీ అభిమానులు

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అభిమానుల‌కు నిజంగా ఇది షాకింగ్ వార్తేన‌ని చెప్ప‌వ‌చ్చు. ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు ఏబీ డివిలియ‌ర్స్ క్రికెట్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పాడు. గ‌తంలోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన ఈ ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్‌.. వివిధ లీగుల్లో ఆడుతున్నాడు. తాజాగా మొత్తం క్రికెట్‌ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. 37 ఏళ్ల వ‌య‌సులో త‌న‌లో ఆడే సత్తా అంత‌గా లేద‌న్న రీతిలో సోష‌ల్ మీడియాలో కామెంట్ చేశాడు. మొత్తం ఆట‌కే వీడ్కోలు ప‌లుకున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

'ఇది ఒక అద్భుతమైన ప్రయాణం, కానీ నేను అన్ని క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. పెరట్లో మా అన్నయ్యలతో మ్యాచ్ ఆడిన‌ప్ప‌టి నుంచి నేను స్వచ్ఛమైన ఆనందంతో మరియు హద్దులు లేని ఉత్సాహంతో ఆటను ఆస్వాదించాను. ఇప్పుడు, 37 ఏళ్ల వయస్సు దాటింది " అంటూ డివిలియ‌ర్స్ ట్వీట్ చేశాడు. ప్ర‌పంచవ్యాప్తంగా త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన అన్ని జ‌ట్ల‌కూ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో బెంగ‌ళూరు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ త‌రుపున డివిలియ‌ర్స్ చాలా కాలంగా ఆడుతున్నాడు. వ‌చ్చే ఏడాది మెగా వేలం జ‌ర‌గ‌నుంది. న‌లుగురు ఆట‌గాళ్ల‌ను అట్టిపెట్టుకునే నిబంధ‌న ఉండ‌డంతో బెంగ‌ళూరు ఖ‌చ్చితంగా కోహ్లీతో పాటు డివిలియ‌ర్స్‌ను అట్టిపెట్టుకుంటుంద‌ని అంతా బావిస్తుండ‌గా.. డిలియ‌ర్స్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడు. దీంతో ఇక ఐపీఎల్‌లో డివిలియ‌ర్స్ ను మ‌ళ్లీ చూసే అవ‌కాశం లేదు.

Next Story