ఆటలోనే కాదు.. అందంలోనూ ఈ మహిళా క్రికెటర్లు మేటి..!
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభమైంది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది
By Medi Samrat Published on 5 Oct 2024 2:40 PM GMTమహిళల టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభమైంది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ ప్రపంచకప్‌లో కొందరు క్రికెటర్లు తమదైన శైలితో అలరిస్తున్నారు. ఆన్‌ఫీల్డ్‌లోనే కాదు, ఆఫ్‌ఫీల్డ్‌లో కూడా ఈ క్రికెటర్ల ఫ్యాషన్ సెన్స్.. గ్లామరస్ స్టైల్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. అలాంటి ఐదుగురు క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.
1. లారెన్ బెల్
ఇంగ్లండ్‌కు చెందిన 23 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ లారెన్ బెల్. తన గ్లామర్, అందంతో కూడా అభిమానులను సంపాదించుకుంది. ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు మూడు టెస్టులు, 14 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడింది. టెస్టులో ఎనిమిది వికెట్లు, వన్డేల్లో 27, టీ20లో 32 వికెట్లు తీసింది. టెస్టులో 67 పరుగులకు మూడు వికెట్లు, ODIలో 37 పరుగులకు ఐదు వికెట్లు, T20ల్లో 12 పరుగులకు నాలుగు వికెట్లు ఆమె అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.
2. స్మృతి మంధాన
భారత ఓపెనర్ స్మృతి మంధానకు ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళా క్రికెటర్లలో ఒకరిగా పేరుంది. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. 28 ఏళ్ల స్మృతి మంధాన భారత్ తరఫున ఇప్పటివరకు ఏడు టెస్టులు, 85 వన్డేలు, 142 టీ20లు ఆడింది. టెస్టులో 629 పరుగులు, వన్డేల్లో 3,585 పరుగులు, టీ20లో 3,505 పరుగులు చేసింది. టెస్టుల్లో 149 పరుగులు, వన్డేల్లో 136 పరుగులు, టీ20ల్లో 87 పరుగులు.. ఆమె అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు.
3. అలియా రియాజ్
పాకిస్థాన్ మహిళా క్రికెటర్లలో అలియా రియాజ్ ఒకరు. 32 ఏళ్ల అలియాకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు పాకిస్థాన్ తరఫున 68 వన్డేలు, 96 టీ20లు ఆడింది. ఆమె ODIలలో 24.51 సగటుతో 1,324 పరుగులు, T20లలో 97.80 స్ట్రైక్ రేట్‌తో 1,112 పరుగులు చేసింది. అలాగే బౌలింగ్‌లో వన్డేల్లో 12 వికెట్లు, టీ20లో 20 వికెట్లు పడగొట్టింది అలియా.
4. డేనియల్ వ్యాట్
ఇంగ్లాండ్‌కు చెందిన 32 ఏళ్ల డేనియల్ వ్యాట్ తన గ్లామర్ కారణంగా ఆన్‌ఫీల్డ్‌లోనే కాకుండా ఆఫ్‌ఫీల్డ్‌లో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున రెండు టెస్టులు, 112 వన్డేలు, 160 టీ20లు ఆడింది. ఆమె టెస్టుల్లో 32.25 సగటుతో 129 పరుగులు, ODIలలో 23.25 సగటుతో 1,907 పరుగులు, T20లలో 128.02 స్ట్రైక్ రేట్‌తో 2,828 పరుగులు చేసింది. దీంతో పాటు వన్డేల్లో 27 వికెట్లు, టీ20లో 46 వికెట్లు పడగొట్టింది.
5. సారా గ్లెన్
ఇంగ్లాండ్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ సారా గ్లెన్ కూడా తన ఆకర్షణీయమైన రూపంతో అభిమానులను సంపాదించుకుంది. 25 ఏళ్ల సారా ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 17 వన్డేలు, 64 టీ20లు ఆడింది. వన్డేల్లో 20 వికెట్లు, టీ20ల్లో 81 వికెట్లు తీసింది. వన్డేల్లో 18 పరుగులకు నాలుగు వికెట్లు, టీ20లో 12 పరుగులకు నాలుగు వికెట్లు ఆమె అత్యుత్తమ బౌలింగ్. దీంతో పాటు వన్డేల్లో 65 పరుగులు, టీ20లో 133 పరుగులు చేసింది.
6. అమేలియా కెర్
న్యూజిలాండ్‌కు చెందిన ఈ 23 ఏళ్ల ఆల్ రౌండర్ ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళా క్రికెటర్లలో ఒకరు. కివీస్ తరఫున ఇప్పటి వరకు 74 వన్డేలు, 80 టీ20లు ఆడింది. ODIలలో 2,082 పరుగులు, T20లలో 1,174 పరుగులు చేసింది. కెర్ వన్డేల్లో 91 వికెట్లు, టీ20లలో 79 వికెట్లు పడగొట్టింది. వన్డేల్లో 17 పరుగులకు ఐదు వికెట్లు, టీ20లో 20 పరుగులకు నాలుగు వికెట్లు ఆమె అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.
7. ఆలిస్ పెర్రీ
ఆస్ట్రేలియాకు చెందిన 33 ఏళ్ల పెర్రీ అత్యంత ఆకర్షణీయమైన క్రికెటర్లలో ఒకరు. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఆమె ఒకరు. ఇప్పటివరకు పెర్రీ 13 టెస్టుల్లో 61.86 సగటుతో 928 పరుగులు, 147 వన్డేల్లో 50.74 సగటుతో 3,958 పరుగులు, 157 టీ20ల్లో 115.87 స్ట్రైక్ రేట్‌తో 1,956 పరుగులు చేసింది. దీంతో పాటు టెస్టులో 39, వన్డేల్లో 165, టీ20లో 126 వికెట్లు తీసింది.
8. మోలీ పెన్ఫోల్డ్
ఈ న్యూజిలాండ్ క్రికెటర్ వయస్సు కేవలం 23 సంవత్సరాలు. కానీ ఆమె తన వేగంతో బ్యాట్స్‌మెన్‌లనే కాకుండా అందంతో కుర్రకారును ఇబ్బంది పెడుతుంది. 11 వన్డేల్లో ఐదు వికెట్లు, 10 టీ20ల్లో ఏడు వికెట్లు పడగొట్టింది.