3rd ODI: భారత్‌ ఘన విజయం.. సెంచరీతో చెలరేగిన రోహిత్‌

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది.

By -  అంజి
Published on : 25 Oct 2025 3:57 PM IST

3rd ODI, Rohit Sharma, Virat Kohli, India, Australia

3rd ODI: భారత్‌ ఘన విజయం.. సెంచరీతో చెలరేగిన రోహిత్‌

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. 237 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో ఒకే వికెట్‌ కొల్పోయి ఛేదించింది. రోహిత్‌ సూపర్‌ సెంచరీ (121*)తో చెలరేగగా కోహ్లీ అర్థ సెంచరీ (74*) నాటౌట్‌గా నిలిచారు. కెప్టెన్‌ గిల్‌ (24) మరోసారి నిరాశపరిచినప్పటికీ.. సీనియర్లు అద్భుత ప్రదర్శనతో వైట్‌వాష్‌ గండాన్ని తప్పించారు. కాగా తొలి 2 మ్యాచ్‌ల్లో ఓటమితో భారత్‌ సిరీస్‌ కొల్పోయిన విషయం తెలిసిందే.

2 సిక్సర్లు, 11 ఫోర్లతో రోహిత్‌ శర్మ 33వ శతకం బాదారు. చివరిసారి ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంచరీ నమోదు చేశారు. ఇక గత మ్యాచులో రోహత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అటు ఆస్ట్రేలియాలో 2500 రన్స్‌ పూర్తి చేసుకున్న రెండో భారత ఆటగాడిగా ఆయన నిలిచారు. అంతకుముందు సచిన్‌ ఈ ఫీట్‌ సాధించారు.

Next Story