2025 సీజన్ ఐపీఎల్ ఆలస్యం.. అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక అప్‌డేట్ ఇచ్చారు.

By Knakam Karthik  Published on  12 Jan 2025 6:50 PM IST
SPORTS, IPL, SPORTS NEWS, BCCI

2025 సీజన్ ఐపీఎల్ ఆలస్యం.. అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ ఆలస్యంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బీసీసీఐ ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులో ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభంపై చర్చించినట్లు రాజీవ్ శుక్లా చెప్పారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 14వ తేదీన ప్రారంభంకావాల్సి ఉండగా, ఆలస్యంగా మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఇక ఫైనల్ మ్యాచ్ మే 25న ఉంటుందని పేర్కొన్నారు. అయితే ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ తేదీలపై ఎలాంటి స్టేట్‌మెంట్ చేయలేదు. కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభంకానున్నట్లు చెప్పారు.

ఈ మీటింగ్‌ ఒకే ఎజెండాతో జరిగిందని, అది కార్యదర్శి నియామకానికి సంబంధించినదే అన్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్ కమిషనర్‌ను కూడా ఏడాది కాలానికి నియమించినట్లు తెలిపారు. బీసీసీఐ నూతన సెక్రటరీగా దేవజిత్ సైకియాను ఎన్నకున్నట్లు చెప్పారు.బీసీసీఐ ట్రెజరరీగా ప్రభ్‌తేజ్ సింగ్‌భాటియా నియామకమైనట్లు చెప్పారు. దాంతో పాటు మహిళల ప్రీమియర్ లీగ్‌పై స్పందించారు. లీగ్ వేదికలను నిర్ణయించామని, త్వరలోనే ప్రకటిస్తామని రాజీవ్ శుక్లా వెల్లడించారు. అయితే ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించిన మెగా వేలం ఇప్పటికే ముగిసింది. జెడ్డా వేదికగా నిర్వహించిన ఈ వేలంలో టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లు సొంతం చేసుకుంది.

Next Story