బంగారు పతాకాన్ని పంచుకోడానికి ఒప్పుకున్నారు.. వారి ఆనందం చూడాలి..!

2 Friends Agree To Share Gold Medal After Dramatic End To High Jump Final. టోక్యో ఒలింపిక్స్ 2020 లో ఖతార్ కు చెందిన ముతాజ్ బార్షిమ్, ఇటలీ

By Medi Samrat  Published on  2 Aug 2021 11:02 AM GMT
బంగారు పతాకాన్ని పంచుకోడానికి ఒప్పుకున్నారు.. వారి ఆనందం చూడాలి..!

టోక్యో ఒలింపిక్స్ 2020 లో ఖతార్ కు చెందిన ముతాజ్ బార్షిమ్, ఇటలీకి చెందిన జియాన్మార్కో తాంబేరి హైజంప్ ఈవెంట్‌ నాటకీయంగా ముగిసింది. స్వర్ణం పంచుకోవడానికి ఇద్దరూ అంగీకరించడం విషయం.. హై జంప్ లో ఇద్దరూ సమంగా నిలవడంతో నిర్వాహకులు వారి ముందు ఊహించని ఆఫర్ ను ఇచ్చారు. బార్షిమ్, తాంబేరి ఇద్దరూ తమ రెండవ ప్రయత్నంలో 2.37 మీటర్ల జంప్ నమోదు చేసి ఫైనల్‌లో టై అయ్యారు. ఒలింపిక్ అధికారులు ఇద్దరూ జంప్-ఆఫ్‌లో పోటీ చేయడానికి సిద్ధమవుతుండగా, బార్షిమ్ రెండు బంగారు పతకాలు ఇవ్వగలరా అని అడిగాడు. బార్షిమ్ అభ్యర్థనకు అధికారులు అంగీకరించారు. అంతే జంప్ ఆఫ్ అన్నది లేకుండా ఇద్దరికీ బంగారు పతకాలను అందించారు. హైజంప్ తుది ఈవెంట్‌లో రెండు బంగారు పతకాలను అందించాలని నిర్ణయించుకున్నారు ఒలింపిక్స్ నిర్వాహకులు. దీంతో ఇద్దరూ ఆనందంతో చేసిన సందడిని చూసి అందరి ముఖాల్లోనూ చిరునవ్వులు నిలిచాయి.

ఖతర్‌కు చెందిన ఇసా ముతజ్‌ బార్షిమ్, ఇటలీ అథ్లెట్‌ గ్లాన్‌మార్కో టంబెరి హైజంప్‌ విజేతలుగా నిలిచారు. వీళ్లిద్దరు 2.37 మీటర్ల ఎత్తుకు ఎగిరారు. మూడో స్థానం పొందిన మాక్సిమ్‌ నెడసెకవు (బెలారస్‌) కూడా 2.37 మీటర్లు జంప్‌ చేసినప్పటికీ అతని 8 ప్రయత్నాల్లో ఒక ఫౌల్‌ ఉంది. దీంతో అతనికి కాంస్యం లభించింది.

'నేను టామ్‌బెరీని చూశాను. అతను నన్నే చూస్తున్నాడు. మేమిద్దరం ఒకరినొకరు చూసుకున్నాం. అంతే ఏం చేయాలో మాకు అర్థమైంది.. టామ్‌బెరీ నాకు ట్రాక్‌లోనే కాకుండా బయట కూడా మంచి మిత్రుడు. ఒలింపిక్స్ స్వర్ణం మా ఇద్దరి కల. ఇప్పుడు అది నిజమైంది. క్రీడా స్ఫూర్తికి అతను నిదర్శనం. మేమిద్దరం ఆ స్ఫూర్తిని ఇక్కడ నుంచి చాటుతున్నాం' బార్‌షిమ్ చెప్పుకొచ్చాడు. స్వర్ణాన్ని పంచుకోవాలనే నిర్ణయం తీసుకున్నాక ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. తర్వాత వారి కోచ్‌లు, సహచరులతో సంబరాలు జరుపుకున్నారు. తమ తమ జాతీయ జెండాలతో పరిగెడుతూ గెలుపు వేడుకలు చేసుకున్నారు.


Next Story