టీ-20 మ్యాచ్‌లో సంచ‌ల‌నం.. పరుగులేమీ ఇవ్వకుండా ఏడు వికెట్లు ప‌డ‌గొట్టింది..!

ఇండోనేషియా బౌలర్ రొహ్మాలియా టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల రోహ్మాలియా 3.2 ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా 7 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది

By Medi Samrat  Published on  25 April 2024 4:15 PM GMT
టీ-20 మ్యాచ్‌లో సంచ‌ల‌నం.. పరుగులేమీ ఇవ్వకుండా ఏడు వికెట్లు ప‌డ‌గొట్టింది..!

ఇండోనేషియా బౌలర్ రొహ్మాలియా టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల రోహ్మాలియా 3.2 ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా 7 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు 2021లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రెడరిక్ ఓవర్‌డిజ్క్ 4-2-3-7 వికెట్లు ప‌డ‌గొట్టిన అత్యుత్త‌మ రికార్డు ఉండ‌గా.. రొహ్మాలియా దానిని బ్రేక్ చేసింది.

రొహ్మాలియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి T20Iలో మంగోలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఈ రికార్డ్ సాధించింది. రొహ్మాలియా తన అసాధారణ ప్రదర్శనతో 3.2-3-0-7తో చరిత్ర సృష్టించింది. త‌ద్వారా రోహ్మాలియా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 7 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచింది. 2019లో మాల్దీవులపై నేపాల్ క్రీడాకారిణి అంజలీ చంద్ 2.1-2-0-6తో వేసిన‌ స్పెల్‌ను అధిగమించి రోహ్మాలియా రికార్డును బద్దలు కొట్టింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టులో ని పుతు అయు నంద సక్రిని 44 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 61 పరుగులు చేసింది. మెండ్‌బయార్ ఎంఖాజుల్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన కోటాలో 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. ఇండోనేషియా మంగోలియాను 16.2 ఓవర్లలో 24 పరుగులకు ఆలౌట్ చేసి 127 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. రొహ్మాలియా అద్భుత ప్రదర్శన కారణంగా ఇండోనేషియా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0 ఆధిక్యంలో నిలిచింది. రోహ్మాలియా 2 మ్యాచ్‌లు ఆడి 1.42 ఎకానమీ రేటుతో 7 వికెట్లు పడగొట్టింది.

Next Story