ఏకంగా 20 మందిని ఆడించిందట..

With 5 debutants in tour, Ajinkya Rahane's team repeat 25-year record. ఆస్ట్రేలియా సిరీస్ మొదలైనప్పటి నుండి భారత ఆటగాళ్లు వరుస గాయాలతో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jan 2021 12:00 PM GMT
ఏకంగా 20 మందిని ఆడించిందట..

ఆస్ట్రేలియా సిరీస్ మొదలైనప్పటి నుండి భారత ఆటగాళ్లు వరుస గాయాలతో దూరమవుతూ వస్తున్నారు. ముఖ్యంగా టెస్టు సిరీస్‌లో భారత ఆటగాళ్లను ఒకరి తర్వాత మరొకరిని గాయాలు పలకరిస్తూనే ఉన్నాయి. తొలి టెస్టు ప్రారంభానికి ముందే ఇషాంత్ శర్మ గాయంతో జట్టుకు దూరం కాగా, ఆ తర్వాతి నుంచి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్టుకు దూరమవుతూ వచ్చారు. తొలి టెస్టులో గాయపడిన పేసర్ మహ్మద్ షమీ సిరీస్‌కు దూరం అయ్యాడు. ఆ తర్వాత ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌లు గాయాల బారినపడ్డారు. దీంతో వారి స్థానాలను ఇతర ఆటగాళ్లతో భర్తీ చేయాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో ఆడిన ఆటగాళ్ల జాబితా 20కి పెరిగింది.

ఓ సిరీస్‌లో భారత జట్టు ఇంతమంది ఆటగాళ్లను ఆడించడం 1961-62 తర్వాత ఇదే తొలిసారి. 2014-15 నాటి ఆస్ట్రేలియా పర్యటనలో, 2018 నాటి ఇంగ్లండ్ పర్యటనలో, 1959 నాటి ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు 17 మందిని ఆడించింది. ఈసారి ఏకంగా 20 మంది ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఈ సిరీస్‌తో మొత్తం ఆరుగురు యువ ఆటగాళ్లు టెస్టుల్లో అరంగేట్రం చేయడం విశేషం. శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. 1996లో ఇంగ్లండ్ పర్యటనలోనూ ఆరుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఆ సిరీస్ లో సునీల్ జోషి, పరాస్ మాంబ్రే, వెంకటేశ్ ప్రసాద్, విక్రమ్ రాథోడ్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ ఉన్నారు. ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో కూడా భారత్ ను గాయాలు పలకరించాయి. నవదీప్ సైనీ ఆఖరి రోజు గాయపడ్డాడు.

Next Story