ఆరో తేదీన 'అజరుద్దీన్' కొత్త ఇన్నింగ్స్

By Newsmeter.Network  Published on  29 Nov 2019 1:34 PM IST
ఆరో తేదీన అజరుద్దీన్ కొత్త ఇన్నింగ్స్

ఆయన ఎన్నో వీరోచిత ఇన్నింగ్స్ లు ఆడాడు. ప్రత్యర్థులను పదే పదే “శతక్కొ”ట్టేశాడు. కానీ ఈ సారి స్టేడియం ను చూస్తే ఆయనకు కంగారు వచ్చేస్తోంది. ఎన్నో ఇన్నింగ్స్ ఆడాను కానీ ఈ ఇన్నింగ్స్ చాలా డిఫరెంట్ అంటున్నాడాయన. ఆయనెవరో కాదు. మన హైదరాబాదీ పరుగుల రేడు మహ్మద్ అజరుద్దీన్. డిసెంబర్ 6 న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగబోయే భారత-వెస్ట్ ఇండీస్ టీ ట్వంటీ క్విక్ ఫైర్ మ్యాచ్ తో అజ్జూ భాయ్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. క్రికెట్ నిర్వాహకుడిగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష హోదాలో ఈ కొత్త పనిని చేపట్టబోతున్నాడు. కొత్త బాధ్యత తీసుకున్నాక ఇంత పెద్ద క్రీడా యజ్ఞం చేయడం ఇదే మొదటి సారి.

అయితే తన టీమ్ లో అనుభవజ్ఞులైన నిర్వాహకులు ఉండటంతో తన పని సులువు అవుతుందని అజర్ భావిస్తున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నానని ఆయన అంటున్నారు. క్రీడాభిమానులందరికీ అత్యుత్తమ ఆతిథ్యం ఇస్తామని అజర్ హామీ ఇస్తున్నారు. స్టేడియంను సర్వాంగ సుందతున్నారు.రంగా తీర్చి దిద్దుతామని, ఎలాంటి లోటూ లేకుండా చూస్తామని ఆయన చెబుతున్నారు. మరో వైపు పోలీసు భద్రత, సదుపాయల కల్పన, పార్కింగ్ వ్యవస్థ, నీటి సదుపాయం వంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నామని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా ఈ టీ 20 మ్యాచ్ రోజే ఉప్పల్ స్టేడియంలో అజరుద్దీన్ స్టాండ్ ను కూడా ప్రారంభించబోతున్నారు. చాలా మంది క్రీడాభిమానులు ఎంతో కాలంగా అజర్ భాయ్ పేరు మీద స్టాండ్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వారందరి కలనూ నిజం చేస్తూ ఈ స్టాండ్ ప్రారంభం కాబోతోంది. అదే విధంగా సీ ఆర దయానంద్ లాంజ్ ను కూడా ప్రారంభిస్తు్న్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన సీనియర్ ఆటగాళ్లైన వెంకటపతి రాజు, అర్షద్ ఆయూబ్ వంటి వారందరినీ కూడా సత్కరించబోతున్నారు.

Next Story