ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Aug 2020 5:51 PM IST
ప్రముఖ ప్లేబాక్ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణియం కరోనా బారినపడిన పడడంతో ఆయనకు చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆగష్టు 14న ఆయన పరిస్థితి విషమించినట్టు ఆసుపత్రి వర్గాలు ప్రత్యేక బులెటిన్ లో తెలిపాయి.
ఎస్పీ బాలసుబ్రమణియంకు ఐసీయూలో వెంటిలేటర్ పై అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గత రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు వైద్యులు గుర్తించడంతో వెంటిలేటర్ పై చికిత్స ప్రారంభించారు. లైఫ్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉందని చెబుతున్నారు.
తనకు కరోనా సోకిందని బాలు కొన్నిరోజుల కిందట స్వయంగా వెల్లడించారు. ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. వైద్యులు హోం ఐసోలేషన్‌లో ఉండమని చెప్పినప్పటికీ కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం లేక ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తూ ఉన్నారు.