ఎస్పీ బాలు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసిన ఎంజిఎం ఆసుపత్రి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Aug 2020 1:58 PM GMT
ఎస్పీ బాలు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసిన ఎంజిఎం ఆసుపత్రి

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఎంజిఎం ఆసుపత్రి తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో లైఫ్ సపోర్ట్ తో ఆయనకు చికిత్స కొనసాగుతోందని హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. నిపుణులైన వైద్య బృందంతో ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నామని.. కోవిడ్ చికిత్సలో నిష్ణాతులైన యూఎస్, యూకే వైద్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ఎస్పీ బాలుకు వైద్య సేవలు అందిస్తున్నామని బులెటిన్ లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఇదిలావుంటే.. బాలుకి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే.. ఆ వార్తల్లో నిజం లేదని ఆయ‌న త‌న‌యుడు చరణ్ తెలిపాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఎస్పీబీ కోలుకోవాలని కొన్ని రోజులుగా ప్రార్థిస్తున్న అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఇక‌.. కొద్ది రోజుల క్రితం ఎస్పీ బాలసుబ్ర‌మ‌ణ్యానికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దీంతో ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఫ్లాస్మా థెరపీ కూడా చేశారు. కాగా.. మొదట ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నా.. మధ్యలో కాస్త విషమించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

B1

Next Story