గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, గాయని స్మితకు కరోనా పాజిటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2020 7:45 AM GMT
గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, గాయని స్మితకు కరోనా పాజిటివ్‌

కరోనా మహ్మమారి ప్రపంచాన్ని వణికిస్తోంది. నెలలు గడుస్తున్నా.. ఈ మహమ్మారి తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. కొన్ని దేశాల్లో కేసులు వేగంగా విస్తరిస్తుంటే.. మరికొన్ని దేశాల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంది. మరో రెండు నెలల పాటు కేసులు ఊహించని స్థాయిలో ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. చిన్న-పెద్ద, ధనిక పేద అన్న తేడా లేదు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా కరోనా బారిన పడ్డారు.

తనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు ఓ వీడియో ద్వారా తెలిపారు. కొద్ది రోజులుగా తనకు జ్వరం వచ్చిపోతోందని, దగ్గుతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీంతో ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా.. కరోనా సోకినట్లు నిర్థారణ అయిందని తెలిపారు. ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. మీ అశీస్సులతో తొందరలోనే కోలుకుంటాను అని ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఇక గాయని స్మిత కూడా కరోనా బారిన పడ్డారు. ఈవిషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉండడంతో.. కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణ అయిందన్నారు. నిన్న నిజంగా దుర్దినం. ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉండడంతో వ్యాయం చేయడం వల్లనేమో అనుకున్నాని అన్నారు. ఎందుకైనా మంచిదని కరోనా టెస్టు చేయించుకున్నానని అన్నారు. పాజిటివ్‌గా వచ్చిందని.. అయితే.. లక్షణాలు అంతగా లేవన్నారు. కరోనా తగ్గిన తర్వాత ప్లాస్మా దానం చేస్తామని తెలిపిరు. మేం ఇంట్లోనే ఎంతో జాగ్రత్తగా ఉన్నామని.. అయినా కరోనా మా ఇంటికి వచ్చిందని ట్వీట్‌ చేశారు.Next Story