మేనకోడలితో కలిసి చరణ్ స్టెప్పులు.. వీడియో వైరల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2020 10:08 AM GMT
మేనకోడలితో కలిసి చరణ్ స్టెప్పులు.. వీడియో వైరల్‌

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా.. కొన్ని నియమాలు పాటిస్తూ షూటింగ్‌ జరుపుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లు ప్రారంభం అవుతున్నాయి. అయితే.. కరోనా ముప్పు తగ్గేంత వరకు పలువురు హీరోలు తమ సినిమా షూటింగ్‌లను వాయిదా వేశారు. కాగా.. షూటింగ్‌లు లేకపోవడంతో.. ప్రస్తుతం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఇంట్లోనే ఉంటున్నాడు.

తనకు ఇష్టమైన పనులు చేస్తూ సమయాన్ని గడపడంతో పాటు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉన్నాడు. తాను చేసే పనులను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు చరణ్‌. ఈ డార్లింగ్‌తో డ్యాన్స్' అంటూ చెర్రీ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో చరణ్‌ తన మేనకోడలు నవిష్కతో కలిసి సెప్టులేశాడు. తన సోదరి శ్రీజ కూతురు నవిష్కకు టీవీ చూపిస్తూ.. చరణ్‌, నవిష్కలు ఇద్దరూ డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. గతంలో కూడా మెగాస్టార్‌ చిరంజీవి కూడా తన మనవరాలు నవిష్కకు సబంధించిన ఓ వీడియోను ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

నవిష్కను ఒళ్లో కూర్చోపెట్టుకున్న చిరు.. ఖైదీ నెంబర్ 150లోని 'మిమ్మీ మిమ్మిమ్మీ' పాటను వింటూ ఎంజాయ్‌ చేశారు. కాగా.. రామ్‌ చరణ్‌ ఈ వీడియో జట్టు, గడ్డం పెంచి డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం చరణ్‌ దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు.Next Story