వర్మ 'మ‌ర్డ‌ర్' మూవీ నుంచి పాట విడుదల.. పిల్లలని ప్రేమించడం తప్పా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2020 6:22 AM GMT
వర్మ మ‌ర్డ‌ర్ మూవీ నుంచి పాట విడుదల.. పిల్లలని ప్రేమించడం తప్పా..?

నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లు ఆగిపోయినా కూడా వర్మ కంపెనీ మాత్రం వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం 'మర్డర్'‌. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ అమృత ఆదారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వర్మ. దీనిక కుటుంబ కథా చిత్రమ్‌ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టాడు. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి, గాయ‌త్రి భార్గవి త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల మ‌ర్డ‌ర్ చిత్ర ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసి సినిమాపై అంచ‌నాలు పెంచిన వ‌ర్మ తాజాగా ఓ పాటను విడుదల చేశారు. 'పిల్ల‌ల్ని ప్రేమించ‌డం త‌ప్పా? 'అంటూ సాగే ఈ పాట‌కి సిరాశ్రీ లిరిక్స్ అందించారు. దాదాపు 70 లక్షల మంది ఈ చిత్ర ట్రైలర్ ను చూశారని, త్వరలో మరో ట్రైలర్ ను, రెండో పాటను విడుదల చేస్తామని నిర్మాత‌లు తెలిపారు. దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలు ఓపెన్ చేసిన తర్వాత విడుదల చేస్తామని వారు వివరించారు. ఆగస్ట్ నెలలో సినిమా తొలికాపీ సిద్ధమవుతుంది. ఆదే నెలలో సెన్సార్ కు పంపుతాం అని నిర్మాతలు వెల్లడించారు.

Next Story